వైరల్‌ వీడియో : ప్లై ఓవర్‌ బ్రిడ్జీ కింద చిక్కుకున్న విమానం, అక్కడకు ఎందుకు వెళ్లినట్లు?

కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి.నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి.

 In China Airplane Stuck Under Bridge-TeluguStop.com

విమానం గాల్లో ఎగురుతూ వందల మందిని ఆకాశ మార్గాన వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది.కాని కొన్ని సార్లు విమానాలను రోడ్డు మీద వెయికిల్స్‌ పై తరలించడం మనం చూస్తూనే ఉంటాం.

ఎయిర్‌ పోర్ట్‌లు దగ్గరగా లేని వారు విమానాలు తమ రోడ్ల మీదకు వచ్చినప్పుడు ఒకింత ఆశ్చర్యంకు గురవుతారు.ఆ విమానం చూసేందుకు గుంపులుగా రోడ్ల మీదకు వస్తారు.

Telugu Airplane, China, Harbin, Chinaairplane, Telugu General, Telugu-

  చైనాలో హర్బిన్‌ అనే నగరంలో విమానంను రోడ్డు ప్రయాణం ద్వారా విమానాశ్రయంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.విమానంను విడగొట్టి విమానాశ్రయంకు తరలిస్తున్నారు.ఒక భారీ ట్రక్‌ పై విమానం బాడీని తీసుకు వెళ్తున్నారు.ఆ సమయంలో ఒక ప్లై ఓవర్‌ బ్రిడ్జీ వచ్చింది.డ్రైవర్‌ ఏదైనా పరద్యానంలో ఉన్నాడో లేదంటే ప్లై ఓవర్‌ ఎత్తును అంచనా వేయక పోయాడో కాని అలాగే ముందుకు వెళ్లాడు.మద్యకు వెళ్లిన తర్వాత విమానం పై భాగం తగులుతుందని అతడికి అర్థం అయ్యింది.

Telugu Airplane, China, Harbin, Chinaairplane, Telugu General, Telugu-

  విమానం పై భాగం ఇప్పటికే దెబ్బ తిన్నది.ఇప్పుడు వెనక్కు లేదా ముందుకు ఎటు వెళ్లలేని పరిస్థితి.ప్లై ఓవర్‌ ను తొలగించి విమానంను ముందుకు తీసుకు వెళ్లే అవకాశం లేదు.టైర్లలో గాలి తగ్గిస్తే ఏమైనా కిందుకు వస్తుందా అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు.దాదాపు రోజంతా కూడా ఆ విమానం అక్కడే ఉండి పోయింది.

Telugu Airplane, China, Harbin, Chinaairplane, Telugu General, Telugu-

  ఏం చేయాలో పాలు పోని అధికారులు ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.దాన్ని బయటకు తీసేందుకు చాలా ఉన్నత స్థాయిలో అధికారులు భేటీ అయ్యి మరీ సంప్రదింపులు జరుపుతున్నారు.చివరకు దాన్ని ఎలా బయటకు తీస్తారో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube