ఏపీలో గెలిస్తే కేంద్రంలో వైసీపీ స్కెచ్ ఏంటి ?  

In Case Ysrcp Win In Ap What Is The Next Plan In Central-chandrababu,jaganmohan Reddy,tdp,ysrcp,ఏపీ,వైసీపీ

ఎన్నికలు ముగిసిన తేదీ నుంచి వైసీపీలో గెలుపుపై ఒకరకమైన నమ్మకం బలంగా ఏర్పడిపోయింది. అందుకే ఆ పార్టీ కాస్త ముందుగానే మంత్రి మండలికి సంబంధించి ఎవరెవరిని తీసుకోవాలి అనే విషయంలో కూడా క్లారిటీ కి వచ్చేసారు. దీనికి తోడు అనేక సర్వేలు కూడా ఏపీలో ‘ఫ్యాను’ గాలి బలంగా వీచింది అంటూ రిపోర్ట్స్ అందించాయి. ఇక ఈ ఆదివారం వెలువడిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకి 137 స్థానాలు దక్కుతాయని వెల్లడయ్యింది. అలాగే ఎంపీ సీట్లు కూడా ఎక్కువే రాబోతున్నట్టు తేల్చింది..

ఏపీలో గెలిస్తే కేంద్రంలో వైసీపీ స్కెచ్ ఏంటి ? -In Case YSRCP Win In AP What Is The Next Plan In Central

ఈ నేపథ్యంలో కేంద్రంలో వైసీపీ ఎవరికి మద్దతు ఇవ్వబోతోంది ? అసలు ఎలక్షన్ రిజల్ట్ తరువాత పరిస్థితి ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.

కేంద్రంలో వైసీపీ పోషించేబోయే పాత్రపై అందరూ రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతకు దారి తీస్తోందని వైసీపీ అంచనా వేస్తుంది.

ఏపీలో అధికారం తమదే అనే నమ్మకంలో ఉన్న వైసీపీ కేంద్రంలోనూ తమ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని గట్టిగా నమ్ముతోంది. కేంద్రంలో హంగ్ వస్తే కనుక ఏదో ఒక కూటమిలో వైసీపీ చేరుతుంది. తద్వారా వైసీపీకి ఖచ్చితంగా కొన్ని మంత్రి పదవులు కూడా లభిస్తాయి.

రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ అధికారంలో తమ భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రూపొందించుకుంటున్నాడు.

అలాగే తాము అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఎంపీ సీట్లు కనుక వస్తే అప్పుడు ఏమి చేయాలి ? ఎటువంటి షరతులతో కేంద్రంలో భాగస్వామ్యం అవ్వాలి అనే విషయంపై లోతుగా చర్చిస్తున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆ పార్టీ స్టెప్ ఎలా ఉండబోతోంది ? మొన్నటి వరకు తిట్టిన బీజేపీతో జతకడతారా ? లేక కష్టమైనా నష్టమైనా కాంగ్రెస్ తోనే ముందుకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీయే కూటమికి 287 స్థానాలు వస్తాయని సి ఓటర్ , 267 అని ఏబీపీ నీల్సన్ సర్వే సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ వేసే రాజకీయ అడుగులపైనే అందరి దృష్టి నెలకొంది.