అహ్మద్ పటేల్ ను అరెస్ట్ చేస్తే బాబు పరిస్థితి ఏంటి ?  

In Case Ahmed Patel In Arrested What Is The Chandrababu Sitchwation - Telugu Chandrababu, Chandrababu And Ahmed Patel, It Officials Give The Notice To Ahamed Patel, It Raids In Chandrababu Pa, M Ahamed Patel In Congress, Tdp Chief Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ నాయకులే లక్ష్యంగా ఐటీ శాఖ చేస్తున్న సోదాల్లో అనేక కీలక విషయాలు బయటపడుతున్నాయి.ఏపీలో దొరికిన మూలలలను బట్టి దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.

In Case Ahmed Patel In Arrested What Is The Chandrababu Sitchwation

ఇప్పటికే ఈ వ్యవహారాలకు సంబంధించి కీలకమైన ఆధారాలను ఐటీ శాఖ సంపాదించింది.చంద్రబాబు నాయుడు పర్సనల్ సెక్రెటరీ ఇంట్లో దొరికిన ఆధారాలను బట్టి కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో గెలుపొందేందుకు ఏపీ నుంచి భారీగా ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీకి అందినట్టుగా ఐటీ శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉండటంతో ఈ దర్యాప్తు మరింత వేగవంతంగా సాగుతోంది.

ఇప్పటికే రెండుసార్లు ఐటీ శాఖ అహ్మద్ పటేల్ ను విచారించేందుకు నోటీసులు ఇచ్చి తమ ముందు హాజరు కావాలని చెప్పినా, ఆయన తాను అనారోగ్యంతో ఉన్నానని, ఇప్పట్లో మీ ముందు హాజరుకాలేను అంటూ సమాచారం ఇచ్చారు.హవాలా ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏపీ నుంచి భారీగా నిధులు వెళ్లినట్టుగా ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.ఈ విధంగా సుమారు 400 కోట్ల వరకు అహ్మద్ పటేల్ కు అందినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు.ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే అహ్మద్ పటేల్ ను తగిన ఆధారాలతో ఈ కేసులో బుక్ చేసే అవకాశం కనిపిస్తోంది.

దీంట్లో అహ్మద్ పటేల్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా తెల్సుస్తోంది.అదే జరిగితే ఈ వ్యవహారాలకు మూల కారణమైన టిడిపి అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు పరిస్థితి ఏమిటనేది ఆసక్తిగా మారింది.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసి కుట్ర చేశారని బిజెపి ఆగ్రహంగా ఉంది.ఇప్పుడు దానికి సంబంధించిన మూలాలు చంద్రబాబు నాయుడు పర్సనల్ సెక్రెటరీ ఇంట్లో దొరికినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో అహ్మద్ పటేల్ తర్వాత చంద్రబాబుకు దీనిపై నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో దీనిపైనే చర్చ జరుగుతోంది.ఇప్పటి వరకు ఐటి దాడులు వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు గాని, కాంగ్రెస్ పార్టీ గాని, పెద్దగా స్పందించలేదు.

దీంతో ఈ వ్యవహారంపై వీరికి సంబంధం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.

తాజా వార్తలు