బాలీవుడ్లో ఆర్‌ఆర్‌ఆర్‌ కు ఏమాత్రం తగ్గని రాధేశ్యామ్‌

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా బాలీవుడ్ లో ఏకంగా 140 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.ఇది ఇప్పటి వరకు ఏ సౌత్ సినిమా కూడా దక్కించుకోని మొత్తం అనడంలో సందేహం లేదు.

 In Bollywood Rrr And Radheshyam Movies Very Close Fight , Bollywood ,  Rrr  , Ra-TeluguStop.com

ఆర్ ఆర్ ఆర్‌ కు దరి దాపుల్లో కూడా ఏ సినిమా నిలిచే అవకాశం ఉండదని అంతా భావించారు.కాని అనూహ్యంగా ప్రభాస్ రాధే శ్యామ్‌ సినిమా ఏకంగా రూ.120 కోట్ల రూపాయలకు బాలీవుడ్ హిందీ రైట్స్ అమ్ముడు పోయినట్లుగా చెబుతున్నారు.

ఆర్ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్‌ సినిమా ల మద్య వ్యత్యాసం కేవలం 20 కోట్లు మాత్రమే.

అంటే ఆర్ ఆర్ ఆర్‌ రేంజ్ లోనే రాధే శ్యామ్ బిజినెస్ చేస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమాత్రం తగ్గేది లేదు అంటూ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి.

మొత్తం బిజినెస్ లో కొద్ది పాటి తేడా ఉంటే ఉండవచ్చు.కాని మొత్తానికి అయితే రెండు సినిమాలు కూడా హోరా హోరీ అన్నట్లుగా పోరాడబోతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Ajay Devagan, Bollywood, Prabhas, Radeshyam, Radheshyam, Radhyashyam, Raj

ఇక వసూళ్ల విషయంలో ఈ రెండు సినిమాలు పోటీ పడబోతున్నాయి.ఖచ్చితంగా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంటుంది.అయితే వాటంత కాకున్నా కూడా రాధే శ్యామ్‌ సినిమా కనీసం 500 కోట్లు వసూళ్లు చేసినా కూడా చాలా గొప్ప విషయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రికార్డులు సృష్టించడం జక్కన్నకు అలవాటు.

అయితే ప్రభాస్ ఆ రికార్డులకు చేరువ అవ్వడం అంటే ప్రభాస్ రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.బాలీవుడ్‌ లో ఇంత భారీ రేటు కు రాధే శ్యామ్ తీసుకున్నారంటే ఇతర నిర్మాతలు నోరు వెళ్లబెడుతున్నారు.

టీ సిరీస్ వారు రాధే శ్యామ్‌ ను హిందీ లో రిలీజ్ చేయబోతున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలు రెండు కూడా వారం గ్యాప్ లోనే రాబోతున్నాయి.

రెండు సినిమా లకు కూడా ఇది ఖచ్చితంగా నష్టం కలిగించే విషయం.సంక్రాంతికి ముందు ఆర్ ఆర్‌ ఆర్‌ వస్తే.

సంక్రాంతి సందర్బంగా రాధే శ్యామ్‌ రాబోతుంది.ఈ రెండు సినిమా లు మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి మరింత గట్టిగా చాటి చెప్పడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube