బెంగాల్ లో బీభత్సం కేంద్ర మంత్రి పై దాడి..!!

బెంగాల్ రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.మమతా బెనర్జీ ఆధ్వర్యంలోనే కావాలని బిజెపి ప్రభావిత ప్రాంతాలలో దాడులు జరుగుతున్నట్లు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి.

 In Bengal Attacks On Union Minister-TeluguStop.com

అంతే కాకుండా నిన్న చాలా రాష్ట్రాలలో బీజేపీ పార్టీ నాయకులు.బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులను నిరసిస్తూ వెంటనే కేంద్రం మిలటరీ బలగాలను ఆ ప్రాంతం లో దింపాలని డిమాండ్ చేయడం జరిగింది.

బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండగా తాజాగా కేంద్ర మంత్రి మురళీధరన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై దాడులు చేయడం జరిగింది.పశ్చిమ మిడ్నాపూర్ లోని పంచక్కుడిలో కొంతమంది ఆకతాయిలు రాళ్లు మరియు కర్రలతో కేంద్రమంత్రి మురళీధరన్ ప్రయాణిస్తున్న కారు పై దాడిచేయడంతో కారు అద్దాలు పగిలిపోయాయి.

 In Bengal Attacks On Union Minister-బెంగాల్ లో బీభత్సం కేంద్ర మంత్రి పై దాడి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో మురళీధరన్ వ్యక్తిగత సిబ్బంది కి గాయాలు కూడా అయ్యాయి.తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ వీడియోను కూడా పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి.

దీంతో వెంటనే బెంగాల్ గవర్నర్ నుంచి బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై నివేదిక కోరింది కేంద్రం.

#West Bengal #Muralidharan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు