అంతమంది ఉన్నా టీడీపీని ముగ్గురే మోస్తున్నారే

తెలుగుదేశం పార్టీని అసెంబ్లీ లో ఒక ఆట ఆడుకుంటున్నారు అధికార పార్టీ శాసనసభ సభ్యులు.వైసీపీ సభ్యుల సంఖ్యా బలం ఎక్కువగా ఉండడడంతో అధికార పార్టీ హావ ముందు టీడీపీ నెగ్గుకురాలేకపోతోంది.

 In Assembly Three Tdp Leader Strong Counter To Ycp Party-TeluguStop.com

టీడీపీ చేస్తున్న విమర్శలపై వైసీపీ సభ్యులంతా మూకుమ్మడిగా ఎదుర్కుంటూ గట్టి ఎదురుదాడి చేస్తున్నారు.టీడీపీకి పేరుకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.

అందులో ముగ్గురు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు.వారే పార్టీ తరపున పోరాడుతూయన్నారు.

మిగిలిన వారు తమకు ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా సైలెంట్ గా ఉండిపోతున్నారు.తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకుంది.

గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే యాక్టివ్ గా ఉన్నా సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.అందుకే అధికార పార్టీ మరింతగా ఎదురుదాడి చేస్తూ టీడీపీకి చుక్కలు చూపిస్తోంది.

Telugu Achhem, Chandrababu, Assemblytdp-

ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.అందులో అధికార పార్టీ నుంచి విమర్శల దాడిని తిప్పికొడుతుంది కేవలం ముగ్గురు మాత్రమే.చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉండడంతో ఆయన కాకుండా అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు మాత్రమే టీడీపీకి రక్షణగా నిలబడుతున్నారు.ఈ ముగ్గురు సభ్యులు మాత్రమే అసెంబ్లీలో యాక్టివ్ గా ఉంటూ టీడీపీ వాయిస్ వినిపిస్తున్నారు.

మిగిలిన వారు ఉన్నా లేనట్టుగానే ఉంటున్నారు.సభ్యుల్లో కేవలం ఒక్క ఆదిరెడ్డి భవానీ కొత్త ఎమ్మెల్యే కావడంతో ప్రశ్నలు వేసి ఊరుకుంటున్నారు.

వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామాచేశారు.ఇక 22 మందిలో గంటా శ్రీనివాసరావు ఈ సభలో కన్పించలేదు.

Telugu Achhem, Chandrababu, Assemblytdp-

పయ్యావుల కేశవ్ కూడా సభకు రావడంలేదు.పయ్యావుల కేశవ్ అనారోగ్య కారణాలతో సభకు హాజరు కాలేనని ముందుగానే అనుమతి తీసుకున్నారు.ఇక బాలకృష్ణ అప్పుడప్పుడూ వస్తున్నా ఆయన మౌనంగానే ఉంటున్నారు.అలాగే టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరాం రోజూ సభకు హాజరవుతున్నప్పటికీ ఆయన మౌనంగానే ఉంటున్నారు.పేరుకు సభకు వస్తున్నారే తప్ప కనీసం లేచి ప్రభుత్వ విమర్శలకు అడ్డు చెప్పడం లేదు.గొట్టిపాటి రవికుమార్ అసలు ఉన్నారా లేరా అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది.

సభలో జిల్లా సమస్యలు వస్తున్నా ఆయన నో రెస్పాన్స్.ఇవన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు ని మరింత కంగారు పెడుతున్నాయి.

అధికార పార్టీ దూకుడుని అడ్డుకునే విషయంలో తమ పార్టీ ఎమ్యెల్యేలు వెనక్కి తగ్గడం బాబు జీర్ణించుకోలేకపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube