ఏపీలో ఆ మ‌హిళా మంత్రికి మైన‌స్ మార్కులేనా...!

ఆ మంత్రికి పార్టీపైనా. సీఎం జ‌గ‌న్‌పైనా మంచి క‌మిట్‌మెంట్ ఉంది.

 In Ap That Women Minister Got Minus Marks,pushpa Sree Vani, Minister, Jagan Moha-TeluguStop.com

ఈ విష‌యంలో సందేహం లేదు.ముఖ్యంగా వైఎస్ కుటుంబంపై చాలా అంకిత భావం ప్ర‌ద‌ర్శించే నాయ‌కురాళ్లలో ఆమె ముందు వ‌రుస‌లో ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆమెకు కీల‌క ప‌ద‌విని అప్ప‌గించారు.కానీ, ఇప్పుడు ఆమె ప‌రిస్థితి అచేత‌నంగా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఆమే కురుపాం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.గిరిజ‌న శాఖ మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు జ‌గ‌న్‌.

రాష్ట్రంలో బ‌హుశ ఈ ప‌ద‌విని చేప‌ట్టిన అతిపి‌న్న వ‌య‌స్కురాలిగా కూడా ఆమె గుర్తింపు పొందారు.

ఇంత మంచి అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.

అనుకున్న విధంగా గిరిజ‌నుల‌కు మేలు చేయ‌లేక పోతున్నార‌ని, పార్టీని ముందుకు న‌డిపించ‌లేక పోతున్నార‌నే వాద‌న చాన్నాళ్లుగా వినిపిస్తోంది.జిల్లాలోనూ ఆమె దూకుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

మ‌రో మంత్రి ఆమె వ్యూహాల‌కు చెక్ పెడుతున్నార‌ని అనే వారు కూడా ఉన్నారు.నిజ‌మే రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు సొంత పార్టీలోనే ఉన్న రోజులు కాబ‌ట్టి.

ఇలాంటి వ్యూహాల‌ను కూడా త‌ట్టుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.కానీ, పుష్ప శ్రీవాణి మాత్రం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నార‌ని అంటున్నారు.

పైగా కుటుంబంలో సొంత మామ‌గారే జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.ఆ స‌మ‌యంలో ఎటు మాట్లాడాలో అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది.దీంతో పార్టీలో ఆమెకు మైన‌స్ మార్కులు ప‌డ్డాయి.ఇక‌, అప్ప‌టి నుంచి కూడా యాక్టివ్‌నెస్ మ‌రింత‌గా త‌గ్గింద‌ని అంటున్నారు.గ‌తంలో గిరిజ‌న శాఖ‌ను చేప‌ట్టిన మ‌హిళా మంత్రి ఒక‌రు.దూకుడుగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఇప్పుడు శ్రీవాణి ఆ రేంజ్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతున్నార‌ని గిరిజ‌న నేత‌ల మ‌ధ్యే చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రి ఇప్ప‌టికైనా ఆమె మారితే.మంచిద‌నే సూచ‌న‌లు వినిపిస్తున్నాయి.

పైగా ఎవ‌రి స‌ల‌హాలూ.సూచ‌న‌లు కూడా పాటించ‌క‌పోవ‌డం కూడా స‌రికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube