అమెరికాలో కుప్పకూలిన విమానం...9మంది దుర్మరణం..!!!  

Plane Crash In Congo Killed 9-

అమెరికాలో జరిగిన విమాన ప్రమాదం స్థానికంగా భయాందోళనలు కలిగించింది.ఈ ఘటనలో సుమారు 9 మంది మృత్యువాత పడ్డారు.గత కొన్ని రోజులుగా అమెరికాలో జరుగుతున్న ప్రమాదాలతో కూడిన మరణాలు ఎక్కువయ్యాయి.దక్షిణ డకోటా రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది.సుమారు 12 మందితో బయలు దేరిన ఈ విమానం తరువాత తన సిగ్నల్స్ చూపించలేదని అధికారులు తెలిపారు.

Plane Crash In Congo Killed 9--Telugu Trending Latest News Updates Plane Crash In Congo Killed 9--Plane Crash In Congo Killed 9-

చంబర్ లైన్ విమానాశ్రయం నుంచీ ఇడావో రాష్టంలోని ఇడావో ప్రాంతీయ విమానాశ్రయానికి పిలాటస్ పీసీ -12 అనే విమానం బయలు దేరిన కొద్ది నిమిషాలకే కుప్ప కూలిపోయింది.అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్న పిల్లలతో పాటుగా పైలెట్ ప్రయాణికులు మొత్తం 9 మంది మృతి చెందారు.

ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి, తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారని, వారి పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.ఇదిలాఉంటే అసలు ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ప్రతి కూల వాతావరణం అవ్వడం వలెనేనని తెలుస్తోంది.

దక్షిణ డకోటా ప్రాంతంలో తుఫాను హెచ్చరిక అమలులో ఉండగా విమానం ఎలా బయలు దేరింది అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.