అమెరికాలో ఈ ఇంజెక్షన్ ఖరీదు ఎంతో తెలుసా..

సహజంగా ఇంజక్షన్ ఖరీదు మహా అయితే 100రూ, లేదంటే 500, మరీ ఖరీదు అంటే 10000, తీవ్రమైన వ్యాధులు వస్తే దాదాపు 50000, నుంచీ రూ.100,000.వరకూ ఉంటుంది.కానీ ప్రపంచంలో ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని రీతిలో అమెరికాలో ఓ ఇంజెక్షన్ తయారు చేసింది నోవార్టిస్‌ ఫార్మా సంస్థ.దాదాపు ఈ ఇంజక్షన్ ఖరీదు 14 కోట్ల రూ పై మాటే.ఈవిషయం తెలుసుకున్న వారందరూ ఇంత ఖరీదైన మందు దేనికీ అంటూ నోళ్ళు వెళ్ళ బెడుతున్నారు.

 In America How Much Price In Injection-TeluguStop.com

ఇంతకీ ఈ ఇంజక్షన్ ఖరీదు ఇంతగా ఉండటానికి కారణం ఏమిటి.?? ఎందుకు దీనికి ఇంత డిమాండ్.అనే వివరాల్లోకి వెళ్తే.ఈ మందు పేరు “జోల్ జెన్ స్మా”.ఈ మందుకి ఎఫ్‌డీఏ అనుమతి కూడా లభించింది.దీని విలువ రూ.14 కోట్ల 57 లక్షలు.దీనిని స్విట్జర్లాండ్‌కు చెందిన మందుల తయారీ సంస్థ నోవార్టిస్‌ తయారు చేసింది.

పసిపిల్లలో వచ్చే జన్యు లోపాలని నిరోధించడానికి ఈ మందుని ఇంజెక్ట్ చేస్తారు.

అమెరికాలో ఈ ఇంజెక్షన్ ఖరీదు ఎ

పిల్లల్లో జన్యు లోపాలకి ఇప్పటికే ఎన్నో మందులు ఉన్నా సరే వీటిని సంవత్సరానికి ఒక సారి చేయాలి.ఇలా పదేళ్ళలో దాదాపు 30 కోట్లకు పైనే ఖర్చు అవుతుంది.కానీ జోల్‌జెన్‌స్మాను ఒకసారి ఇంజెక్ట్‌ చేస్తే సరిపోతుందని దానికి గాను కేవలం 14 కోట్లు మాత్రమే అవుతుందని లెక్కలు చెప్తున్నారు కంపెనీ యాజమాన్యం.

మరి 14 కోట్లతో ఇంజక్షన్ చేయించుకునే వారు ఎంత మంది ఉన్నారో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube