అజయ్ డైరెక్షన్ లో తప్పకుండా ఆ హీరోతో నటిస్తా: విక్రమ్

కోలీవుడ్ నటుడు విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం కోబ్రా.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేస్తుంది.

 In Ajays Direction She Will Definitely Act With That Hero Vikram Ajay's Directio-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ సెషన్ లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే విక్రమ్ నటుడు విజయ్ దళపతి గురించి చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 In Ajays Direction She Will Definitely Act With That Hero Vikram Ajay's Directio-TeluguStop.com

ఈ సందర్భంగా విక్రమ్ విజయ్ గురించి మాట్లాడుతూ.

ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈయన ఎంతో సైలెన్స్ మైంటైన్ చేస్తూ ఉంటారు.

ఇకపోతే ఈయన డాన్స్ నాకు ఎప్పటికీ నచ్చుతుందంటూ విజయ్ గురించి ఆయన నటన వ్యవహార శైలి గురించి విక్రమ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇక భవిష్యత్తులో ఎప్పటికైనా డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విజయ్ తో కలిసి సినిమా చేస్తానని ఈయన తెలిపారు.

Telugu Ajays, Cobra, Vijay Dalapati, Vikram-Movie

ఇలా విజయ్ తో కలిసి నటించాలనేది అద్భుతమైన ఐడియా.ఈ సినిమా కచ్చితంగా కార్యరూపం దాల్చాలి.ఈ విషయాన్ని విజయ స్టైల్ లో చెప్పాలంటే నేను వెయిటింగ్ అంటూ ముగించారు.ఇలా విక్రమ్ విజయ్ తో కలిసి తప్పకుండా సినిమా చేస్తానని చెప్పడంతో విజయ్ అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ సినిమా ఎప్పుడు కార్యరూపం దాలిస్తుందో తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube