ఝార్ఖండ్ అసెంబ్లీ( Jharkhand Assembly )లో కొత్త సీఎం చంపై సోరెన్ మరికాసేపటిలో బలపరీక్ష జరగనుంది.ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అసెంబ్లీకి తీసుకువచ్చారు.
మొత్తం 81 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 41 మ్యాజిక్ ఫిగర్ గా మారింది.జేఎంఎం పార్టీ( Jharkhand Mukti Morcha )కి చెందిన ఎమ్మెల్యేలు 28 మంది ఉండగా కాంగ్రెస్ కు 16 మంది, ఆర్జేడీ మరియు సీపీఐ – ఎంఎల్ కు ఒక్కొక్క ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 46 మంది ఉన్నారు.
చంపై( Champai Soren ) ప్రభుత్వానికి ఈ 46 మంది సభ్యుల మద్ధతు ఉండగా.ప్రతిపక్ష బీజేపీ ( BJP )సంఖ్యాబలం 29 గా ఉంది.అయితే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప బలపరీక్ష లాంఛనప్రాయమనే చెప్పుకోవచ్చు.మరోవైపు బల పరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలను మూడు రోజులపాటు అధికార కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంపులో ఉంచిన సంగతి తెలిసిందే.