ఆస్ట్రేలియా: సిక్కులు గర్వపడే క్షణం... పార్లమెంట్‌లో గురు గ్రంథ్ సాహిబ్ పర్కాష్ ఉత్సవ్

ఆస్ట్రేలియాలోని నాల్గవ అతిపెద్ద రాష్ట్రమైన దక్షిణ ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారిగా ‘‘ గురు గ్రంథ్ సాహిబ్ పర్కాష్ ఉత్సవ్’’ పార్లమెంట్ లోపల జరిగింది.సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ 522వ జయంతి వేడుకల సందర్బంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 In A First, Guru Granth Sahib Parkash Utsav Inside South Australian Parliament ,-TeluguStop.com

పంజ్ ప్యారే (ఐదుగురు ప్రియమైనవారు) గురు గ్రంథ్ సాహిబ్‌ను పార్లమెంట్ వెలుపల నుంచి .చారిత్రాత్మక మెట్ల నుంచి ఇండోర్ హాల్‌కు మోసుకొచ్చారు.ఈ దృశ్యం పార్లమెంటేరియన్లు, ప్రజలకు కనువిందు చేసింది.గురునానక్ సందేశాన్ని వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఈ మొట్టమొదటి పర్కాష్ వేడుక, కీర్తనలు నిర్వహించారు.

లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ సభ్యుడైన రస్సెల్ వోర్ట్‌లీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.భారతీయ సమాజానికి చెందిన ప్రముఖులు, దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన రాజకీయ నాయకులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రస్సెల్ మాట్లాడుతూ.తాను ఎన్నో గురుద్వారాలలో ప్రార్థనలు, పండుగలు, కార్యక్రమాలు, వివాహాలకు హాజరయ్యానని గుర్తుచేసుకున్నారు.

ధైర్యవంతులు, యోధులు, రక్షకులైన సిక్కులతో తనకు అవినాభావ సంబంధం వుందని రస్సెల్ అన్నారు.

ప్రార్థనలతో పాటు భోజనాన్ని పంచుకోవాలన్న గురునానక్ బోధనలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని రస్సెల్ వ్యాఖ్యానించారు.

మీరంతా గురుద్వారాలలో వంటలు చేస్తూ.పంచుకుంటూ, సందేశాన్ని ఇస్తున్నారని ఆయన సిక్కులను ప్రశంసించారు.

ఆస్ట్రేలియాలో కొన్ని నెలల క్రితం సంభవించిన కార్చిచ్చు సమయంలో ఆపదలోవున్న ప్రజలకు ఎంతోమంది సిక్కులు భోజనం అందించారని ఆయన గుర్తుచేశారు. వోర్ట్‌లీ తన భార్య, పార్లమెంట్ సభ్యురాలైన డానా వోర్ట్‌లీ కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దక్షిణ ఆస్ట్రేలియా హౌస్ ఆఫ్ అసెంబ్లీ స్పీకర్ డాన్ క్రీగన్ కూడా వున్నారు.వీరితో పాటు అడిలైడ్ ఫెడరల్ సభ్యుడు స్టీవ్ జియోర్గానాస్, ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ సభ్యుడు, ప్రతిపక్షనేత అయిన పీటర్ మలినాస్కాస్ కూడా పాల్గొన్నారు.

Telugu Federalmember, Afghanistan, Australia, Bangladesh, Gurugranth, Guru Nanak

కాగా.ఆస్ట్రేలియాలో సిక్కు మతం మైనారిటీ కేటగిరీలో వుంది.దేశ జనాభాలో సుమారు 0.5 శావతం మంది సిక్కు మతాన్ని అనుసరిస్తారు.ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారత సంతతి ప్రజల్లో సిక్కు వర్గమే అతిపెద్దది.2016 జనాభా లెక్కల ప్రకారం.ఆస్ట్రేలియాలో 1,25,00 మంది సిక్కులు వున్నట్లు అంచనా.1996లో 12 వేలుగా వున్న సిక్కుల జనాభా… 2001లో 17 వేలకు, 2006లో 26,500కు చేరింది.వీరిలో భారత ఉపఖండానికి చెందిన భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌ దేశాలకు చెందిన సిక్కులు వున్నారు.ఆస్ట్రేలియాలో పంజాబీ భాష 13వ స్థానంలో వుంది.సుమారు 1,00,000 అక్కడ పంజాబీ మాట్లాడతారని అంచనా.అలాగే ఆస్ట్రేలియాకు వచ్చే వలసదారులు మాట్లాడే భాషల్లో పంజాబీది మూడో స్థానం.81 శాతం మంది సిక్కులు, 13.3 శాతం హిందువులు, 1.4 శాతం మంది ముస్లింలు పంజాబీని మాట్లాడతారు.సిక్కుల ప్రాబల్యం దృష్ట్యా 1988లో ఆస్ట్రేలియా ప్రభుత్వం తొలిసారిగా వార్షిక సిక్కు క్రీడలను నిర్వహించింది.

దక్షిణ ఆస్ట్రేలియా, విక్టోరియా, సౌత్ వేల్స్‌ల నుంచి పెద్ద ఎత్తున సిక్కులు అడిలైడ్‌ చేరుకుని హాకీ తదితర క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube