పాతికేళ్ల తర్వాత రజిని ఇమేజ్‌ డ్యామేజ్‌ అయింది  

In 25 Years Story First Time Rajani Image Damaged -

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ సినిమాలు అనగానే ఓ స్థాయిలో ఓపెనింగ్స్‌ లభిస్తాయి.టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతాయి.

In 25 Years Story First Time Rajani Image Damaged

తమిళనాట మాత్రం రజినీ చిత్రాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది.ఇక ఈయనతో పోటీ పడిన ఏ హీరో అయినా కూడా రజినీ తర్వాతే అని చెప్పవచ్చు.ఇతర హీరోల సినిమాలకు ఎంత పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం రజినిదే పై చేయి.1992లో కమల్‌ హాసన్‌తో పోటికి దిగిన రజినిపై కమల్‌ది పై చేయి.ఆ తర్వాత రజిని చిత్రాల తర్వాతనే మరే చిత్రం అయినా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.

తాజాగా రజిని పాతికేళ్ల ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యింది.ఈ సంక్రాంతికి రజిని ‘పేట’ చిత్రంతో ,అజిత్‌ ‘విశ్వాసం’ చిత్రంతో సంక్రాంతి బరిలో దిగారు.ఈ రెండు చిత్రాలకు కూడా మంచి టాక్‌ దక్కింది.

పాతికేళ్ల తర్వాత రజిని ఇమేజ్‌ డ్యామేజ్‌ అయింది-Movie-Telugu Tollywood Photo Image

కలెక్షన్లు కూడా ఇంచుమించుగా సమానంగా ఉన్నాయి.అయితే కేవలం తమిళనాడు విషయానికొస్తే ఈసారి అజిత్‌ చిత్రం పై చేయిగా కలెక్షన్లు రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘పేట’ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది కానీ తమిళనాడులో మాత్రం ‘విశ్వాపం’ పై చేయిగా ఉంది.v

దాంతో రజినీ రికార్డు బ్రేక్‌ అయ్యింది.పాతికేళ్ల నుండి కాపాడుకుంటూ వస్తున్న రజిని ఇమేజ్‌ను అజిత్‌ డ్యామేజ్‌ చేశాడు అని చెప్పవచ్చు.గతకొంత కాలంగా రజిని చిత్రాలు ఊహించిన విధంగా ఆడకపోయిన కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి.

దాంతో ఈసారి ఇలా జరగడంతో రజిని అభిమానులు కూడా షాకవుతున్నారు.తమిళనాట ‘పేట’, ‘విశ్వాసం’ రెండు చిత్రాలు కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు