2021 లోనూ ఒలంపిక్స్ లేనట్లేనా..?!

జపాన్ లో జరగాల్సిన ఒలంపిక్స్ నిర్వహణపై అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతూ ఉంటే.మరోవైపు టోక్యో ఒలంపిక్స్ రద్దు చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 In 2021 Tokyo Olympics Is Going To Cancel, Olmpics, Suspenstion, New Type Of Car-TeluguStop.com

కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఈ ఒలంపిక్స్ నిర్వహించడానికి సాధ్యం కాదని ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

వచ్చే సంవత్సరం వరకు ఒలంపిక్స్ వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు జపాన్ ప్రభుత్వం సీనియర్ సభ్యుడు ఒకరు ప్రముఖ దిన పత్రిక ద్వారా తెలియజేశారు.తాజాగా బ్రిటన్ లో విజృంభిస్తున్న స్ట్రెయిన్ కేసులలో జపాన్ లో కూడా స్ట్రెయిన్ కేసులు నమోదు అవ్వడం మొదలవడంతో కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నారు ఆ దేశంలో.

ఇలాంటి పరిస్థితుల మధ్య ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Telugu Japan, Type Carona, Olm, Strain-Latest News - Telugu

వాస్తవానికి ఒలంపిక్స్ గత ఏడాది 2020 లోనే జరగాల్సి ఉండగా.కరోనా వైరస్ కారణం చేత 2021 లో ప్రారంభం అవుతున్నట్లు తెలియజేశారు.కానీ, ప్రస్తుతం కొత్త రకం కరోనా కేసులు అధిక సంఖ్యలో ఉండడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.దాదాపు 2.90 లక్షల కు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అంతేకాకుండా వచ్చే సంవత్సరం కూడా ఈ పోటీలు నిర్వహిస్తామన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.అంతేకాకుండా 2032 వరకు ఒలంపిక్ నిర్వహించేందుకు సాధ్యం కాదని ప్రభుత్వం అతి త్వరలోనే అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీకి తెలియజేయబోతున్నట్లుగా సమాచారం.

అనంతరమే ఒలంపిక్స్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకొని అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube