2020 పూర్తిగా బన్నీ నామ సంవత్సరం

హాలీవుడ్‌ మొదలుకని టాలీవుడ్‌ కోలీవుడ్‌ వరకు అన్ని భాషల సినిమా పరిశ్రమలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది.సినిమాల విడుదల కనీసం 10 శాతం కూడా లేదు.

 Bunny Creates Record In 2020, Ala Vaikuntapuramlo, Allu Arjun, Gemini Tv, Trp Ra-TeluguStop.com

తెలుగులో సంక్రాంతి సీజన్‌ కు వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో ఆ తర్వాత వచ్చిన భీష్మ మరో రెండు మూడు చిన్న సినిమాలు మినహా మరేమి లేవు.వచ్చిన ఈ కొన్ని సినిమాల్లో బన్నీ అల వైకుంఠపురంలో సినిమా బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది.

కేవలం వసూళ్ల పరంగా కాకుండా ఈ సినిమా అనేక రికార్డలను నమోదు చేస్తు ఉంది.

సినిమా విడుదలకు ముందు పాటలతో యూట్యూబ్‌ లో రికార్డ్‌లు నమోదు చేసింది.

విడుదల తర్వాత సినిమా ఆల్‌ టైం ఇండస్ట్రీ హిట్‌ ను బన్నీ అందుకున్నాడు.సరిలేరు నీకెవ్వరు సినిమాకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు చివరకు ఆ సినిమాకు అందనంత దూరంలో అల నిలిచింది.

వసూళ్ల విషయం మర్చిపోతున్న సమయంలోనే సినిమాలోని ఒక్కో పాట ఒక్కో రికార్డును నమోదు చేస్తూ వస్తోంది.యూట్యూబ్‌ లో ఏ సౌత్‌ ఇండియన్‌ సినిమా మ్యూజిక్‌ ఆల్బం దక్కించుకోని బిలియన్‌ కు పైగా వ్యూస్‌ ను ఈ పాటలు దక్కించుకున్నాయి.

ఇక తాజాగా మరో రికార్డు కూడా నమోదు అయ్యింది.

Telugu Allu Arjun, Bheeshma, Bunny Creates, Gemini Tv, Mahesh Babu, Trp-

జెమిని టీవీలో ప్రసారం అయిన అల వైకుంటపురంలో చిత్రం దాదాపుగా 30 రేటింగ్‌ ను దక్కించుకుంది.ఒక తెలుగు సినిమా ఈ స్థాయి రేటింగ్‌ సాధిస్తుందని ఏ ఒక్కరు ఊహించి ఉండరు.ఈసారి కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా నెం.1 గా ఉంటే దాన్ని బీట్‌ చేసి మరీ అల వైకుంఠపురంలో సినిమా రికార్డ్‌ కొట్టింది.మొత్తానికి 2020 సంవత్సరం ఇతరులకు చేదు అనుభవంగా మిగిలినా, చేదు సంఘటనలు ఉన్నా బన్నీకి మాత్రం 2020 మెమోరబుల్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube