పాకిస్థాన్‌లో దారుణ పరిస్థితి, చేతులెత్తేసిన ప్రధాని

కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో

అగ్ర దేశాలు

, అభివృద్ది చెందిన దేశాలు కూడా చేతులు ఎత్తేస్తున్నాయి.ప్రపంచ దేశాలు మొత్తం ఆర్థిక ఇబ్బందులతో అలమటిస్తున్నాయి.

 Pakishan Prime Minister Imran Khan Helpless To Poor Peoples, Imran Khan, Pakisth-TeluguStop.com

ఇలాంటి సమయంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తమ దేశంను ఆదుకోవాలంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాడు.లాక్‌డౌన్‌ను విధించడంతో తమ దేశం ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని, పేదలకు తిండి పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటూ తాజాగా ఒక వీడియో సందేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రపంచ దేశాలకు చేతులు ఎత్తి దండం పెడుతూ తమను ఆదుకోవాంటూ విజ్ఞప్తి చేశాడు.పాకిస్తాన్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 5200 కాగా మృతులు దాదాపుగా వంద మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు అవుతుంది.దాంతో అక్కడ పేదలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఇప్పటికే పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది.ఈ సమయంలో మరింత దారుణంగా అక్కడ పరిస్థితులు తయారు అయ్యాయి.

చాలా ఏళ్లుగా అమెరికా వంటి దేశం పాకిస్థాన్‌ను ఆర్థికంగా ఆదుకుంటూ వస్తుంది. ఈ సమయంలో అమెరికా కూడా పాక్‌ను ఆదుకునే పరిస్థితి లేదు.

మరి పాక్‌ ముందు ముందు మరెన్ని సమస్యలను ఎదుర్కోబోతుందో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube