భారత గగనతలం పై ప్రయాణించడానికి ఇష్టపడని పాక్ ప్రధాని

భారత విమానాలు పొరుగుదేశం పాకిస్థాన్ గగనతలం పై రాకపోకలు సాగించకూడదు అంటూ ఆ దేశం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీ లు తమ విదేశీ పర్యటనలు జరిగినప్పుడు కూడా పాక్ గగనతలం పై వారి విమానాలకు అనుమతి లభించలేదు.

 Imran Khan Not Intrested To Travelling Indian Airspace-TeluguStop.com

అయితే తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం మలేషియా దేశంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన విమానం భారతదేశ గగనతలం మీదుగా ప్రయాణించకూడదని ఆయనకు ఆయననే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు ఆ దేశ విమానయాన రంగ అధికారులు తెలిపారు.

పుల్వామా దాడి, భారత్ వాయుసేన దాడుల ఘటనల అనంతరం పాక్ తన గగనతలం మీదుగా భారత విమానాలు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించింది.అంతేకాకుండా జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం కూడా పాక్ ఆ నిషేధాన్ని కొనసాగించింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానం తన గగనతలంమీదుగా రాకపోకలు సాగించకుండా నిషేధించిన పాకిస్థాన్ తీరుపై భారతప్రభుత్వం అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థకు ఫిర్యాదు కూడా చేశారు.అయితే తాజాగా ఆయన మలేషియా లో పర్యటించాల్సి ఉండగా దానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విమానయాన సంస్థ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube