ఇమ్రాన్ ను చేస్తూ సోషల్ మీడియా లో నెటిజన్ల పోస్ట్ లు...విషయమేంటంటే

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా లో నెటిజన్లు మండిపడుతున్నారు.ఇంతకీ విషయం ఏమిటంటే సౌదీ రాజుని ఇమ్రాన్ అవమానించారత.

 Imran Khan Disrespects Saudi King1-TeluguStop.com

ఇప్పుడు ఇదే విషయం పై సోషల్ మీడియా లో చర్చ నడుస్తుంది.గతవారం సౌదీ ప్రభుత్వం మక్కా లో అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సమావేశం ఏర్పాటు చేసింది.

అయితే ఈ సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా హాజరయ్యారు.

-Telugu NRI

ఈ సందర్భంగా ముందుగా సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ తో కరచాలనం చేసి ఒకపక్కన కూర్చున్నారు.అనంతరం వీరి మధ్య కాసేపు సంభాషణ సాగింది.అయితే సౌదీ రాజు తో పక్కనే ట్రాన్స్ లెటర్ ఇమ్రాన్ చెప్పే సందేశాన్ని ఆయనకు వివరిస్తున్నారు.

అయితే చివరిగా ఇమ్రాన్ చెప్పిన మాటలు ఇంకా రాజు గారికి ట్రాన్స్ లెటర్ ట్రాన్స్ లెట్ చేసే లోపే ఇమ్రాన్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.అయితే దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

-Telugu NRI

సౌదీ రాజు తో ఇమ్రాన్ ప్రవర్తన సరిగా లేదని,ఆయనను ఇమ్రాన్ అవమానించారు అంటూ నెటిజన్లు ఇమ్రాన్ ను ట్రోల్ చేస్తూ తెగ కామెంట్లు పెడుతున్నారు.అంతేకాకుండా ఇమ్రాన్ సౌదీ లో సరైన ప్రోటోకాల్ పాటించలేదు అంటూ కూడా నెటిజన్లు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా సౌదీ రాజుతో మాట్లాడేటప్పుడు ఇమ్రాన్‌ బాడీ లాంగ్వేజ్‌ సరిగా లేదని ఇమ్రాన్‌ ప్రవర్తన కారణంగా ఆ తర్వాత సౌదీ, పాక్‌ల మధ్య జరగాల్సిన సమావేశం రద్దయిందంటూ పలువురు నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.57 దేశాలు సభ్యత్వం ఉన్న ఓఐసీ ప్రపంచంలోని ముస్లింల కోసం పనిచేస్తున్నట్టు ప్రకటించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube