మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్‌ ప్రధాని  

Imran Khan Comments On Article 370-imran Khan Tweet On Social Media About Article 370,pakistan Pm Imaran Khan

ఒకప్పుడు క్రికెటర్‌గా ఉన్న సమయంలో ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతం చాలా పెద్ద స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.ఎప్పుడు పడితే అప్పుడు భారత్‌ పై పడి ఏడుస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌ గత కొన్ని రోజులుగా కశ్మీర్‌ ఆర్టికల్‌ 370 విషయమై నానా రచ్చ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ప్రస్తుతం కశ్మీర్‌లో పరిస్థితులు అస్సలు బాగాలేవు అంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ అంతర్జాతీయ వేదికపై కూడా గొడవ చేసే ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు.

Imran Khan Comments On Article 370-imran Khan Tweet On Social Media About Article 370,pakistan Pm Imaran Khan-IMran Khan Comments On Article 370-Imran Tweet Social Media About 370 Pakistan Pm Imaran

తాజాగా ఐక్యరాజ్య సమితిలోని 58 దేశాలు ఇండియాపై తాము చేసిన విమర్శలను సమర్ధించాయి అంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.తాము నైతికంగా భారత్‌పై పై చేయి సాధించినట్లుగా ఆయన గొప్పలు చెప్పుకున్నాడు.కాని అసలు విషయాన్ని ఇండియా విదేశాంగ శాఖ వెళ్లడించింది.ఐక్య రాజ్యసమితిలోని మానవ హక్కుల కమీషన్‌లో ఉండేవి మొత్తం 47 దేశాలు మాత్రమే.మరి ఈ 58 దేశాలు ఎక్కడ నుండి వచ్చాయంటూ వ్యంగంగా భారత విదేశాంగ శాఖ ప్రశ్నించింది.పాకిస్తాన్‌ దుర్బుద్ది మరోసారి బయట పడిందని ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.

Imran Khan Comments On Article 370-imran Khan Tweet On Social Media About Article 370,pakistan Pm Imaran Khan-IMran Khan Comments On Article 370-Imran Tweet Social Media About 370 Pakistan Pm Imaran