కోబ్రా ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న విక్రమ్

తమిళ విలక్షణ నటుడు విక్రమ్ చేసే సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.విక్రమ్ సినిమా వస్తుందంటే ఏదో కొత్తదనం గ్యారెంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది.

 Impressive Vikram Cobra First Look-TeluguStop.com

కాగా గతకొంత కాలంగా విక్రమ్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ అవుతున్నా, కమర్షియల్ సక్సెస్ మాత్రం కావడం లేదు.కాగా విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం కోబ్రా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విక్రమ్ ఏకంగా ఏడు గెటప్స్‌లో కనిపించాడు.

సైంటిస్ట్, ప్రీస్ట్, పొలిటీషియన్ ఇలా ఏకంగా ఏడు గెటప్స్‌లో విక్రమ్ కనిపించడంతో ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాలో అందరినీ మోసం చేసే వ్యక్తిగా విక్రమ్ కనిపిస్తాడని, అందులో భాగంగానే ఇలా వివిధ గెటప్స్‌లో కనిపిస్తాడని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Chiyaan Vikram, Cobra, Vikram-Movie

గతంలో దశావతారం సినిమాలో ఏకంగా పది గెటప్స్‌లో కనిపించిన కమల్ వావ్ అనిపించాడు.మరి ఇప్పుడు విక్రమ్ ఈ సినిమాతో ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి అంటున్నారు సినీ వర్గాలు.అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube