యాపిల్స్ తినటం వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు  

ఎర్ర యాపిల్ లో యాంటీఆక్సిడాంట్ లో వ్యాధులను ఎదుర్కొనే సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు సాదారణ కణాల మరమత్తులో సాయం చేయటం మరియు ఆక్సీకరణం నష్టాన్ని నిరోదించటానికి సహాయపడతాయి. ఒక మీడియం సైజ్ యాపిల్ లో పెక్టిన్ అనే పైబర్ 4 గ్రాములు ఉంటుంది.పెక్టిన్ అనేది కరిగే,పులిసే మరియు జిగటగా ఉండే ఫైబర్ అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందో చూద్దాం.

1. తెల్లని మరియు ఆరోగ్యకరమైన దంతాలు


ఒక ఆపిల్ టూత్ బ్రష్ ని భర్తీ చేయదు. కానీ యాపిల్ ని కొరికి నమలటం వలన, నోటిలో లాలాజలం ఉత్పత్తి పెరగటం వలన బాక్టీరియా స్థాయి తగ్గి దంత క్షయం తగ్గుతుంది.

2. అల్జీమర్స్


ఎలుకలపై నిర్వహించిన ఒక కొత్త అధ్యయనంలో, ఆపిల్ రసంను ఎలుకలకు ఇచ్చినప్పుడు అల్జీమర్స్ కి దూరంగా ఉండటం మరియు మెదడు మీద వృద్ధాప్య ప్రభావాలపై పోరాటం చేయడాన్ని గమనించారు. యాపిల్ రసాన్ని త్రాగని ఎలకలలో కన్నా త్రాగిన ఎలకలలో న్యూరోట్రాన్స్మిటర్ ఎసిటైల్ కోలిన్ పెరుగుదలను గమనించారు.

3. పార్కిన్సన్ కి వ్యతిరేకంగా పోరాటం


ఒక పరిశోధనలో పండ్లు మరియు అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకుంటే పార్కిన్సన్ వ్యాధికి వ్యతిరేకంగా రక్షణ కలిగిస్తుందని తెలిసింది. ఈ వ్యాధి కారణంగా మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే నరాల కణాలు పతనం అవుతాయి. అందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసే శక్తి కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

4. మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది


ప్రతి రోజు ఒక యాపిల్ తినే మహిళల్లో, యాపిల్ తినని వారి కంటే టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు 28 శాతం తక్కువగా ఉంటాయి. యాపిల్స్ లో ఉండే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెరను మొద్దుబారేలా చేస్తాయి.

5. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది


యాపిల్ లో ఉండే కరిగే ఫైబర్ ప్రేగుల్లో ఉండే కొవ్వును బందిస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.