ఏయ్ పిల్లా అంటూ ప్రేమను పంచుతున్న చైతూ-సాయి పల్లవి  

Impressive Ay Pilla Preview From Love Story-love Story,naga Chaitanya,sai Pallavi,sekhar Kammula

ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లవ్‌స్టోరీ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Impressive Ay Pilla Song Preview From Love Story-Love Story Naga Chaitanya Sai Pallavi Sekhar Kammula

కాగా ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమాలోని ఏయ్ పిల్లా పాటకు సంబంధించిన ప్రీవ్యూ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

నాగ చైతన్య, సాయి పల్లవిల మధ్య రొమాన్స్‌ను ఆ పాటలో మనకు చూపించనున్నారు.

ఈ వీడియోలో సాయి పల్లవి చైతూ బుగ్గపై ముద్దు పెడుతుంది.దీంతో చైతూ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి కంటతడి పెడతాడు.

కాగా ముద్దు పెడితే ఏడుస్తారా అంటూ సాయి పల్లవి ప్రశ్నిస్తుంది.మొత్తానికి ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ పాటను ప్రేమికుల రోజు కానుకగా చిత్ర యూనిట్ అందించడంతో చైతూ, సాయి పల్లవి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను శేఖర్ కమ్ముల తనదైన శైలిలో డైరెక్ట్ చేస్తుండగా పవన్ సీహెచ్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాతో శేఖర్ కమ్ముల మరోసారి తనదైన మద్ర వేయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఏప్రిల్ నెలాఖరుకు ఈ సినిమాను రిలీజ్ చేయాలని కమ్ముల భావిస్తున్నాడు.

తాజా వార్తలు

Impressive Ay Pilla Preview From Love Story-love Story,naga Chaitanya,sai Pallavi,sekhar Kammula Related....