నాకు ఆత్మహత్యే శరణ్యం

తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రూబి చౌదరి ఈ రోజు మీడియాలో హెచ్చరించింది .ఆమె నకిలీ సర్టిఫికేట్ తో ఐ ఏ ఎస్ ట్రైనీ అవతారం లో ఆధికార్లకు చిక్కిపోయింది.

 Impostor Ruby Blames Ias Training Academy Deputy Director-TeluguStop.com

ఈవ్యవహారంలో అంతా గజిబిజిగా ఉన్నట్టు అధికార్లు చెబుతున్నారు .వివరాలలోకి వెడితే….ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి జాతీయ అకాడెమీలో నకిలీ ఐడీ కార్డు సాయంతో ఐఏఎస్ ట్రెయినీగా కొన్నాళ్ళపాటు సాగిన వెరిఫికేషన్ లో అనుమానించబడింది.రూబిచౌదరి తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర మనస్థాపంలో ఉంది.

అకాడమీకి చెందినా ఓ అధికారి మాట్లాడుతూ యూపీకి చెందిన రూబీ చౌదరి అనే మహిళ నకిలీ ఐడీ కార్డు సాయంతో ఈ అకాడెమీలో ఐఏఎస్ ట్రెయినీగా ప్రవేశింఛి 6 నెలలు కొనసాగిన వ్యవహారం కాస్త గుట్టు రట్టుకావడంతో అకాడెమీ డిప్యూటీ డెరైక్టర్ అయిన సౌరభ్ జైన్ నకిలీ ఐడీ కార్డు ఇచ్చారని ఆమె బల్ల గుద్ది చెబుతోంది .ఈ విషయంలో తప్పు చేయకుంటే ఆయన ధైర్యంగా ముందుకు రావాలని పదేపదే కోరితే దీనిపై అకాడమి విచారించి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది అని తెలిపారు .ఇక రూబిచౌదరి మాత్రం తనను తప్పు పట్టడం పై అగ్గిబుగ్గయి పోతోంది .అకాడెమీలో చేరడానికి రూ.20 లక్షలు చెల్లించేందుకు జైన్‌తో బేరం కుదిరిందని, అందులో ఇప్పటివరకు రూ.5 లక్షలు చెల్లించినట్టు ఆమె పాతపాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే వుంది.ప్రస్తుతం అకాడమీలో గార్డుకు కేటాయించిన గదికే రూబియా పరిమితమై ఉన్నట్లు తెలిసింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube