తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక భేటీ అయ్యారు.ఈ సమావేశానికి మంత్రులు మహముద్ అలీ, తలసానితో పాటు హైదరాబాద్ జిల్లా నేతలందరూ హాజరైయ్యారని సమాచారం.
అయితే ఈ భేటీ అభివృద్ధిపై చర్చించేందుకు మాత్రమేనని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.ఓ పక్క మంత్రుల నివాసాల్లోనూ, కార్యాలయాల్లోనూ ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
తలసాని సోదరులను ఈడీ అధికారులు విచారించగా.తాజాగా మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.