పురుషులలో వీర్యస్కలనం కలగకపోవడానికి కారణాలు

అంగస్తంభన సమస్యలు చాలామంది పురుషులకి ఉండేదే.అలాగే శీఘ్రస్కలన సమస్య కూడా చాలా కామన్ గా కనిపించే సమస్య.

 These Are The Important Causes For Dry Orgasm In Men-TeluguStop.com

కాని కొంతమంది దురదృష్టవంతులకి విచిత్రంగా వీర్యం సరిగా స్కలించదు.ఇది అరుదుగా కనిపించినా, తీవ్రమైన సమస్యే.

దీన్ని “డ్రై ఆర్గాజం” అని అంటారు మెడికల్ భాషలో చెప్పాలంటే.ఈ ఇబ్బంది రావడానికి గల కారణాలు ఏంటో చూద్దాం.

* కొందరికి వీర్యం బయటకిరాకుండా మూత్రకోశంలోకి వెళ్ళిపోతుంది.దాంతో వీర్యం మూత్రంతో పాటు బయటకి వెళ్ళిపోతుంది.

ఈ కండీషన్ తో బాధపడేవారు తమ శరీరంలో వీర్యం అసలు ఉత్పత్తే కావడం లేదోమో అని బాధపడుతుంటారు.తెలుగులో ఈ సమస్యని ప్రతిలోమ వీర్యస్కలనం అని అనవచ్చు.

ఈ కండీషన్ కి పలురకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

* అధిక రక్తపోటు కోసం వాడే కొన్నిరకాల మందులు కూడా వీర్య ఉత్పత్తిని అడ్డుకుంటాయి.

* కొందరికి జన్యుపరమైన కారణాల వలన కూడా వీర్యం సరిగా ఉత్పత్తి కాదు.

* రతిలో పాల్గోనేముందు హస్తప్రయోగం చేయకపోవడమే మంచిది.

కొందరికి హస్తప్రయోగం అలవాటు అతిగా ఉంటుంది.దాంతో స్కలనం పలుమార్లు జరిగి వీర్యం నిల్వ ఉండదు.

అలాంటప్పుడు శృంగారంలో భావప్రాప్తి పొందడం కష్టమైపోతుంది.

* టేస్టోస్ట్రీరోన్ లెవెల్స్ సరిగా ఉండటం వీర్య ఉత్పత్తికి చాలా అవసరం.

టేస్టోస్ట్రీరోన్ పడిపోతే వీర్య ఉత్పత్తి కూడా పడిపోతుంది.

* వెన్నుముక్క గాయాలు, డయాబెటీస్, వీర్యనాళంలో అంతరాయం వలన కూడా స్కలనం జరగడం కష్టమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube