చేప నూనెతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు     2018-07-03   23:31:09  IST  Lakshmi P

మనం ఎక్కువగా గింజల నుండి తయారైన నూనెలను వాడుతూ ఉంటాం. కొన్ని నూనెలను వంటల కోసం ఉపయోగిస్తే కొన్ని నూనెలను ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే చేపల కాలేయం నుండి తీసిన నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ నూనెను క్యాప్సిల్ రూపంలో కూడా మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఇప్పుడు చేప నూనెలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. చేప నూనెలో విటమిన్ ఎ, డి, ప్రోటీన్ల వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

పొట్ట దగ్గర కొవ్వును కరిగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. చేప నూనెలో కొవ్వును కరిగించే గుణాలు అధికంగా ఉంటాయి.

జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది.

యాంటీ ఏజింగ్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన వయస్సు రీత్యా వచ్చే సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

కీళ్లనొప్పులు ఉన్నవారు చేప నూనెను రాసి 5 నిమిషాల పాటు మర్దన చేసి ఆ తర్వాత వేడి నీటితో కాపడం పెడితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.

చేప నూనె మధుమేహ రోగులకు కూడా బాగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా చేప నూనెను తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

చేప నూనెలో విటమిన్ ఎ, డి, ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన ఎముకలకు,దంతాలకు బలాన్ని ఇవ్వటమే కాకుండా ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది.