సంక్రాంతి రోజు ఈ పనులు చేస్తే మీ అదృష్టం తిరిగినట్టే     2018-01-07   21:56:11  IST  Raghu V

హిందూ పంచాంగం ప్రకారం పుష్య మాసంలో సంక్రాతి వస్తుంది. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశి లోకి ప్రవేశించే రోజును మకర సంక్రాతిగా జరుపుకుంటాం. అత్యంత పవిత్రమైన రోజున సిరి సంపదలు కలగాలని కుటుంబంతో కలిసి ఈ పండుగను జరుపుకుంటాం. మకర సంక్రాతి రోజున పుణ్య స్నానాలు ఆచరించటం వలన బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది. పుణ్య నదులకు వెళ్లలేని వారు ఆ నీటిని తెచ్చుకొని స్నానము చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే పుణ్య ఫలం లభిస్తుంది.

సంక్రాతి రోజు సాధ్యమైనంత వరకు చల్లని నీటితో స్నానము చేయాలి. ఒకవేళ సంక్రాతి రోజున స్నానము చేయకపోతే అనారోగ్యం బారిన పడతారు. అంతేకాక నిరుపేదగా గడపవలసి వస్తుందట. మకర సంక్రాతి రోజున పుణ్య స్నానము ఆచరించి పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఆ పిండాలను పితృ దేవతలు స్వీకరించి తమ దీవెనలను అందిస్తారు.

భోగి లేదా సంక్రాతి రోజున పుణ్య నదుల నీటితో గుడిలో గాని ఇంటిలో గాని అభిషేకం చేయాలి. మకర సంక్రాతి రోజు అప మృత్యు దోష నివారణకు దుర్గా సప్త స్తుతి పారాయణ చేయాలి. ఒకవేళ పారాయణ చేయటం కుదరకపోతే ఎవరితోనైనా పారాయణ చేయించవచ్చు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా గాలిపటాల పందాలను పెట్టుకుంటారు. ఇలా గాలిపటాలను వేగరవేయటం వెనక ఒక వైజ్ఞానిక కారణం ఉంది. అది ఏమిటంటే మకర సంక్రాతి మొదలు అయినప్పటి నుండి సూర్యుని కిరణాలు తేజోవంతం అవుతాయి. చలి కారణంగా అందరు ఇంటిలో ఉండిపోవటం వలన శరీరానికి కావలసిన కొన్ని విటమిన్స్ తగ్గిపోతాయి. ఇలా గాలిపటాలు ఎగరవేయటానికి బయటకు వస్తే సూర్య కిరణాలు శరీరం మీద పడి అవసరమైన విటమిన్స్ అందుతాయి.

పుణ్య నదులలో స్నానము చేయటం వలన పాపాలు పోవటమే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. మకర సంక్రాతి రోజు ఆనందంగా ఉండాలి. నిషేదించిన ఆహారాలను తినకూడదు. ఆ రోజు ఆవుకి గ్రాసం,బెల్లం తినిపించాలి. మకర సంక్రాతి రోజున ఈ పనులను గుర్తుంచుకొని పాటిస్తే మీ అదృష్టం తిరుగుతుంది.