రథసప్తమి రోజు 7జిల్లేడుఆకులతో ఇలాచేస్తే 7 జన్మల పాపాలు పోతాయి  

Importance Of Ratha Saptami -

హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు.సూర్య భవవానుడు కస్యపుమహాముని కుమారుడు.

సూర్య భగవానుని జన్మ తిథి అయినా మాఘ సుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందుతాం.సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసం లో రథసప్తమినాడు సూర్యుడిని పూజించే అవకాశం లేని వారు మాఘమాసం లో ఒక ఆదివారం పూజించినా కూడా మంచి ఫలితం వస్తుందని మన పెద్దలు అంటారు.

Importance Of Ratha Saptami-Devotional-Telugu Tollywood Photo Image

రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే స్నానము చేసి, సూర్యోదయానంతరం దానాలు చేయాలి .ఈరోజు సూర్య భగవానుని ఎదుట ముగ్గు వేసి ,ఆవుపిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి ,చిక్కుడు ఆకులపై ఆ పోంగలిని ఉంచి సూర్య భగవానునికి నైవేద్యం పెట్టాలి.ప్రతి మాసంలోను సప్తమి తిధి వస్తుంది.అయితే మాఘ మాసంలో వచ్చే సప్తమి బాగా విశిష్టమైనది.మన వేదాలలో సూర్య భగవానుడు ఏడు గుర్రాల బంగారు రధంపై గమనం ఉంటుందని చెప్పబడింది.

సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు అయనాలు ఉన్నాయి.

ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము.ఈ దక్షిణాయనంలోసూర్యరథం దక్షిణ దిశగా పయనిస్తుంది.

తరువాత సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించటం ఉత్తరాయన ప్రారంభ సూచకము.అందుకే రథసప్తమి అని పేరు వచ్చింది.

అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు.

మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము.

ఆరోజు సూర్యోదయానికి ముందు స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని చేస్తే అనేక కోట్ల పుణ్యఫలము మరియు ఆయురారోగ్య సంపదలను ఇచ్చును.ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను,రేగు పండును తలపై పెట్టుకొని నదీస్నానము చేస్తే ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని చెప్పారు.

జిల్లేడు ఆకునకు అర్కపత్రమని అని పిలుస్తారు.సూర్యునికి “అర్కః” అని మరొక పేరు ఉంది.

అందువలన సూర్యునికి జిల్లేడు అంటే చాలా ప్రీతికరమైనది.

ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.

ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.

రథసప్తమి నాడు బంగారముగాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమ, దీపములతో అలంకరించి అందులో ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానం ఇవ్వాలి.

ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి.ఈ విధంగా రథసప్తమీ వ్రతము చేసి సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కలుగుతాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Importance Of Ratha Saptami Related Telugu News,Photos/Pics,Images..

DEVOTIONAL