దేవాలయంలోని మూలవిరాట్ ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా?  

Significance of praying Mulavirat in Temples, Mulavirat, Temples, Significance, Praying God, - Telugu Hindu Believs, Hindu Temples, Indian Temples, Mula Virat

మన భారతదేశం ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలకు నిలయం.పురాతన కట్టడాలతో నిర్మితమైన ఈ దేవాలయాలను సందర్శించడానికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ దేవాలయాలను సందర్శిస్తుంటారు.

TeluguStop.com - Importance Of Mulavirat In Temples

పురాతన కట్టడాలతో నిర్మించిన ఈ ఆలయాలలో మూలవిరాట్ ను ప్రతిష్టించిన తరువాత ఆ మూలవిరాట్ ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది.
సాధారణంగా దేవాలయాల్లో విగ్రహాన్ని ప్రతిష్టించే ముందు ఆ స్థానంలో పంచ లోహాలను వేసి విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఈ లోహాలు తరంగాలకు వాహకాలుగా పనిచేస్తాయి.

సాధారణంగా భూమి లోపల ఎక్కడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు కనిపిస్తాయో ఆ ప్రాంతంలో మూలవిరాట్ ను ప్రతిష్టించడం వల్ల ఆ శక్తి విగ్రహ రూపంలో మనకు ప్రసారం అవుతుంది.కొందరికి మనస్సు ఎంతో బాధగా, అలజడిగా ఉన్నప్పుడు దేవాలయాలను దర్శించి మనశ్శాంతిని పొందుతుంటారు.

TeluguStop.com - దేవాలయంలోని మూలవిరాట్ ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా-Devotional-Telugu Tollywood Photo Image

గుడికి వెళ్ళిన భక్తుడు మూలవిరాట్ ను దర్శించుకోవడం ద్వారా ఆ విగ్రహం నుంచి శక్తి భక్తుడి లోనికి ప్రవేశించి అతనిలో ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించి మనసును ఎంతో తేలికపరుస్తుంది.ఇక సైన్స్ పరంగా అయితే సైన్సుకు అంతుచిక్కని విషయం మన దేవాలయాల్లో దాగి ఉందని భావిస్తారు.అంతేకాకుండా మనం దేవాలయాలను దర్శించినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, గర్భ గుడి వెనుక భాగాన్ని నమస్కరించటం వల్ల మరింత శక్తిని పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

గర్భగుడిలో మూలవిరాట్ పై సూర్య కిరణాలు పడినప్పుడు విగ్రహం కింద ఉన్న లోహాల ద్వారా శక్తి ప్రచురితమై గర్భగుడి నలుమూలలా ప్రసరిస్తాయి.

అయితే గర్భగుడి వెనుక భాగానికి మూలవిరాట్ ను తక్కువ దూరం ఉండటం వల్ల గర్భ గుడి వెనుక భాగాన్ని నమస్కరించడం ద్వారా ఆ శక్తిని మనం పొందగలుగుతామని సైన్స్ చెబుతోంది.గాలిలోని ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు లోహాల ద్వారా శక్తిని ప్రసారం చేయుటవల్ల గర్భగుడిలో ఉన్న మూల విరాట్ అంతటి శక్తిని కలిగి ఉంటుంది.

#Mula Virat #Hindu Believs #Indian Temples #Hindu Temples

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Importance Of Mulavirat In Temples Related Telugu News,Photos/Pics,Images..

DEVOTIONAL