తాళి బొట్టులో దాగి ఉన్న పరమార్ధం ఏమిటో తెలుసా?

స్త్రీ జీవితంలో మాంగల్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది.పెద్దల సమక్షంలో కట్టిన తాళిబొట్టును ఆమె ఎంతో ప్రాణప్రదంగా మరియు ఎంతో పవిత్రంగాచూసుకుంటుంది.

 Importance-of-mangalsutra-hindu-marriages, Mangalsutra , Hindu , Marriages ,trad-TeluguStop.com

పూర్వ కాలంలో తాటి ఆకును చిన్న ముక్కగా కట్ చేసి రిబ్బన్,లా చుట్టి పసుపు కుంకుమ పెట్టి మూడు ముళ్ళు వేయించే ఆచారం ఉండేది.ఆ తర్వాత పసుపు కొమ్ము కట్టటం ఆచారంగా మారింది.

తాళిలో సూత్రాలు పుట్టింటివారి బొట్టు అత్తింటివారి బొట్టు అనే రెండు సూత్రాలు ఉంటాయి.ఇటు పుట్టింటి గౌరవం … అటు అత్తింటి మర్యాదను కాపాడాలనే విషయాన్నీ గుర్తు చేస్తూ ఉండడమే తాళిబొట్టు లోని అసలైన పరమార్ధం.

డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు తాళి బొట్టును బంగారంతో చేయించటం అనాదిగా వస్తున్న ఆచారం.

ఈ ఆచారానికి ఆరోగ్యానికి సంబంధం ఉంది.బంగారం శరీరంలో వేడిని నియంత్రిస్తుంది.అంతే కాక బంగారం మీద నుంచి నీరు పారటం వలన చర్మ వ్యాధులు రావు.

అలాగే ఆయుష్షును పెంచటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.అందువల్ల బంగారాన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.

ఈ విధంగా తాళిబొట్టు అనేది వివాహం అయిన స్త్రీకి సమాజంలో గౌరవం మరియు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube