రెండు మంగళసూత్రాల వెనుక ఉన్న అద్బుత రహస్యం ఏమిటో తెలుసా?

హిందూ వివాహంలో మాంగల్యధారణ అనేది చాలా ముఖ్యమైనది మరియు అతి ప్రధానమైనది.మంగళ సూత్రమును శతమానం,పుస్తె,తాళిబొట్టు,తాళి అనే పేర్లతో కూడా పిలుస్తారు.

 Importance Of Mangalsutra 2-TeluguStop.com

వివాహం జరగాలంటే మంగళసూత్రం తప్పనిసరి.హిందూ సాంప్రదాయంలో మంగళసూత్రం అనేది పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటిదని చెప్పవచ్చు.

ఒక్కసారి స్త్రీ మెడలో మంగళసూత్రం పడిందంటే జీవితాతం ఉండాల్సిందే.

మంగళసూత్రంలో ముత్యాలు,నల్లపూసలు,పగడాలు మొదలైన వాటిని గుచ్చుకుంటారు.

మంగళసూత్రం ధరించటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం.వరుడు వధువు మెడలో తాళి కట్టే ఆచారం ఆరో శతాబ్దంలోనే ప్రారంభం అయింది.

మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది.సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు ఉన్నాయి.

సూత్రం అంటే అర్ధం తాడు, ఆధారమైనది.సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు.

అలాగే తొమ్మిది లేదా పదకొండు దారం పోగులు కలిపి కూడా కొంత మంది తాళిని తయారుచేస్తారు.మాంగళ్య ధారణ జరిగే సమయంలో “ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ” అనే మంత్రాన్ని పఠిస్తారు.

మంగళసూత్రం అనేది భార్యా భర్తల శాశ్వత సంబంధానికి గుర్తు.ఇది వైవాహిక జీవితంలో వచ్చే అన్ని రకాల కీడులను తొలగిస్తుందని నమ్మకం ఉంది.

స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు.అలాగే వివాహిత మెడలో మంగళ సూత్రము లేదంటే భర్త చనిపోయినట్లుగా భావిస్తారు.

మంగళసూత్రంలో పగడం,ముత్యం ధరించటం వలన ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube