మకర సంక్రాంతి గురించి మీకు తెలియని కొన్ని ఆశక్తికరమైన విషయాలు   Importance Of Makar Sankranti     2018-01-12   21:37:23  IST  Raghu V

హిందువులు ప్రతి పండుగను లూనార్ క్యాలెండర్ ప్రకారం జరుపుకోవటం వలన ప్రతి సంవత్సరం పండుగల తేదీలు మారతాయి. కానీ సంక్రాతి పండుగను సోలార్ క్యాలెండర్ ని అనుసరించి చేసుకోవటం వలన ఇంచుమించు ప్రతి సంవత్సరం ఒకే తేదీన జనవరి 14 న వస్తుంది. సంక్రాతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించుట వలన మకర సంక్రాతి అని పేరు వచ్చింది.

ఆ రోజు వసంత కాలం అధికారికంగా వస్తుంది. ఆ రోజు పగలు,రాత్రి సమయాలు ఎక్కవ ఉంటాయి. ఈ పండుగను దేశం మొత్తం జరుపుకుంటారు. ఇప్పుడు మకర సంక్రాంతి గురించి మీకు తెలియని కొన్ని ఆశక్తికరమైన విషయాల తెలుసుకుందాం.

ఈ రోజు సూర్యుడు తన కోపాన్ని వదిలేసి తన కుమారుడు అయిన శనిని కలుస్తాడని మూఢనమ్మకం ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు స్వీట్స్ తింటూ ఆనందంగా గడపాలని చెప్పుతారు.

సంక్రాతి రోజు నువ్వులు,బెల్లం తినాలి. ఈ పండుగ శీతాకాలంలో వచ్చినందు వల్ల నువ్వులు,బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.

గాలిపటాలను పూర్వ కాలంలో పగలు ఎగరవేసేవారు. ఎందుకంటే ఆ సమయంలో కిరణాలు మన శరీరం మీద బాగా ప్రసరిస్తాయి. ఉదయం సూర్య కిరణాలు మన ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. ఇన్ఫెక్షన్లు, రోగాలు రాకుండా కాపాడుతుంది. అలాగే శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా పోతుంది.

ఈ ప్రత్యేకమైన రోజున దక్షిణ భారతదేశంలోని కేరళలో కష్టమైన శబరిమల యాత్ర పూర్తి అయితే, ఉత్తరప్రదేశంలో కుంభ మేలా మకర సంక్రాంతి నుండి ప్రారంభమవుతుంది. దేశంలోని ఇతర ప్రాంతాలలోని ప్రజలు తమ పాపాలను పోగొట్టుకోవడానికి నదుల్లో పవిత్ర స్నానాలను కూడా చేసి ఈ పండుగను జరుపుకుంటారు.