కలశం అంటే ఏమిటి? దానిని ఎందుకు పూజిస్తారు?  

Importance Of Kalasam In Hindu Religion-కలశం అంటే ఏమిటి

హిందూ సంప్రదాయం ప్రకారం గృహ ప్రవేశాలకు, వివాహాలకు,కొన్ని పూజలచేసుకునే సమయంలో కలశం పెట్టి పూజ చేస్తూ ఉంటాం. ఇత్తడి లేదా రాగితతయారుచేసిన ఒక పాత్రలో నీటిని పోసి మామిడి ఆకులు వేసి కొబ్బరికాయ పెడతాంఆ పాత్ర మెడ చుట్టూ నలుపు లేదా తెలుపు దారాన్ని చుడతాం. ఈ విధంగతయారుచేసిన పాత్రను కలశం అని అంటారు..

కలశం అంటే ఏమిటి? దానిని ఎందుకు పూజిస్తారు?-Importance Of Kalasam In Hindu Religion

అసలు కలశాన్ని ఎందుకు పూజించాలంటే….దానికి ఒక కథ ఉంది. దాని గురించఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం సృష్టి ఆవిర్భవానికి ముందు… పాలసముద్రంలశ్రీ మహావిష్ణువు తన శేషశయ్యపై పవళించి ఉన్న సమయంలో అతని నాభి ప్రాంతనుంచి వెలువబడిన పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అలా ఉద్భవించిబ్రహ్మ.

ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు.అదేవిధంగా కలశంలో వున్న నీరు సృష్టి ఆవిర్భవంలో ప్రథమంగా పుట్టిన నీటికప్రతీకగా నిలుస్తుంది.

మామిడి ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీకలుగనిలుస్తాయి. కళాశానికి కట్టిన దారం సృష్టిలో బందించబడిన ప్రేమనసూచిస్తుంది. అందువలన కళాశాన్ని శుభ సూచకంగా సూచిస్తారు.