పెళ్ళిలో జీలకర్ర,బెల్లంను ఎందుకు పెడతారో తెలుసా?

మన హిందూ సంప్రదాయం ప్రకారం ఎన్నో ఆచారాలు ఉన్నాయి.ఆ ఆచారాల వెనక ఎన్నో పరమార్ధాలు ఉన్నాయి.

 Importance Of Jeelakarra Bellam In Marriages-TeluguStop.com

మన సంప్రదాయాలు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క ఆంత‌ర్యాన్ని తెలియజేస్తాయి.జీలకర్రను సంస్కృతంలో జీర దండం అని అంటారు.

జీర శబ్దానికి అర్థం జీవనం,బతుకు అని అర్ధం .దండం అంటే బతుకునకు ఆధారం అని అర్ధం.ఇక బెల్లాన్ని గుడం అంటారు.గుడం అంటే నిద్ర, మత్తు.దీనినే పరవశం అని కూడా అంటారు.ఇలా జీలకర్ర, బెల్లం అంటే జీవనాధార గుణం అని అర్థం.

జీవించటానికి కావాల్సింది ప్రేమ, స్నేహం, మైత్రి, ఆపేక్ష, ఎదుటివారిని ప్రేమించటమే నిజమైన జీవనధార దండం.


తాను వివాహం చేసుకుంటున్న భార్యను ప్రేమించటం, భార్య భర్తను ప్రేమించటం.ఇద్దరిలో అన్యోన్యత,అనుబంధం ఉండి వారి మధ్య ప్రేమ ఒక మత్తులా, ఒక నిద్రలా ఉండి మరేది తెలియకూడదు.దీనినే ఒకరికొకరు, ఒకరిలో ఒకరు జీవించాలనేదే దీని పరమార్ధం.

ఒకసారి వివాహ బంధంతో కలిసిన దంపతులు విడిపోకూడదు.జీలకర్ర, బెల్లాన్ని నూరి కలిపితే మరల దానిని విడదీయలేం.ఈ కలిపిన మిశ్రమంలో బెల్లం మాత్రమే కన్పిస్తుంది.అసలు జీలకర్ర కన్పించదు.

దీని అర్ధం భార్యాభ‌ర్త‌ల‌ జీవనంలో ఎదుటివారికి వారి పరవశం, జీవన మాధుర్యం, ఆ మత్తే కనిపిస్తుంది.దాని వెనక ప్రేమ, స్నేహం, అనురాగం, మైత్రి అంతర్లీనంగా ఉంటాయి.

జీవితాంతం జీలకర్ర,బెల్లం వలే భార్యాభర్తలు కలిసి మెలసి జీవించాలని భోదిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube