హనుమంతుని జండా ఇంటి పై ఎందుకు ఉంచాలో తెలుసా?  

  • మహా భారత యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి తన రథంపై ఆంజనేయస్వామి జెండాను ఉంచమని చెప్పుతాడు. అప్పుడు అర్జునుడు దానికి కారణం అడగగా… రామ అవతారంలో రావణ సంహారం ఆంజనేయుని సాయంతో జరిగింది. అందువల్ల ఆంజనేయస్వామి ఎక్కడ ఉంటే అక్కడ విజయం, లాభం చేకూరుతాయని చెప్పుతాడు శ్రీ కృష్ణుడు. అప్పుడు అర్జునుడు ఆంజనేయ జండా ను రథంపై పెడతాడు.

  • ఆ తరవాత పాండవులు కౌరవులపై విజయాన్ని సాధిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరు తమ ఇంటిపై మరియు వాహనంపైనా ఆంజనేయ జెండా ఉంచితే సమస్త దేవతల అనుగ్రహం కలిగి సమస్త గ్రహ దోషాలు పోవటమే కాకుండా అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరు ఆంజనేయ జెండాను తప్పనిసరిగా ఇంటిపై పెట్టుకుంటే మంచిది.