ప్రతి దేవాలయం ముందు ధ్వజస్తంభం పెట్టడానికి కారణం ఇదే..!

మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెంది ఉన్నాయి.అయితే ప్రతి ఒక్క దేవాలయం ఎదురుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది.

 Dhwaja Sthambam, Importance, Temple, First Pooja, Dhwaja Sthambam Story ,dhwaja-TeluguStop.com

ఎంతో మంది భక్తులు దేవాలయానికి సందర్శించినప్పుడు ధ్వజస్తంభానికి కూడా పూజలు చేయడం మనం చూస్తుంటాము.అదేవిధంగా ధ్వజస్తంభం పై భాగంలో దీపం పెట్టడం సర్వ సాధారణంగా జరుగుతుంటుంది.

అయితే ఈ విధంగా ప్రతి ఆలయం ముందు స్తంభం పెట్టడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తరువాత మయూరధ్వజుడు సింహాసనాన్ని అధిష్టించి అ ధర్మాలకు, అన్యాయాలకు తావులేకుండా ఎంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ, తన కన్నా ఎవరు గొప్ప దాన పరులు లేరనిపించుకోడం కోసం విచ్చలవిడిగా దాన ధర్మాలు చేశాడు.ఇదంతా గమనిస్తున్న కృష్ణుడు ఎలాగైనా అతనికి గుణపాఠం నేర్పించాలని భావించాడు.

ఎలాగైనా యుద్ధం చేసే మయూరధ్వజుడు గుణపాఠం చెప్పాలని భావించిన పాండవులు, కృష్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యారు.యుద్ధం జరుగుతున్న సమయంలో పాండవులు అతని సైన్యంతో హోరాహోరీగా పోరాడుతారు.

చివరికి ఎలాగైనా యుద్ధం జయించాలని ఉద్దేశంతో కృష్ణుడు ధర్మరాజు వృద్ధ బ్రాహ్మణ వేషంలో మయూరధ్వజుడు కంట పడతారు.ఆ బ్రాహ్మణులకు ఏం కావాలో కోరుకోమని మయూరధ్వజుడు అడగగా అందుకు మీ శరీర సగ భాగం కావాలని అడుగగా అందుకే ఆ రాజు ఏ మాత్రం సంకోచించకుండా తన శరీరాన్ని ఖండించు కోబోతాడు.

Telugu Dhwaja Sthambam, Dhwajasthambam, Pooja, Importance, Temple-Telugu Bhakthi

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపం చూపి నిజం చెప్పి ఏదైనా వరం కోరుకోమంటాడు.అప్పుడు ఆ రాజు నేను మరణించినప్పుడు నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా దీవించండి అని అడగగా… అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికాడు.నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరుతో ధ్వజస్తంభం ఉంటుంది.అక్కడికి వచ్చే భక్తులు మొదటగా నిన్ను ఆరాధించే ఇష్టదైవాలను దర్శించుకుంటారు.ఎవరైతే నీఎదుట దీపారాధన చేస్తారో వారి జన్మ సఫలమవుతుంది.అదే విధంగా ధ్వజస్తంభంపై దీపం పెట్టడం వల్ల ఆ దీపం రాత్రి సమయంలో బాటసారులకు వెలుగు అవుతుంది.

అంటూ వరం ఇచ్చాడు.ఆ విధంగా అప్పటి నుంచీ ప్రతి దేవాలయం ముందు దేవాలయంలోని విగ్రహానికి సమానంగా ధ్వజస్తంభానికి పూజలను నిర్వహిస్తారు.

భక్తులు సైతం ఈ ఆలయంలోనికి ప్రవేశించే ముందు ధ్వజస్తంభానికి పూజించాలి.అదేవిధంగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు స్తంభానికి కూడా ప్రదక్షిణలు చేయడం వల్ల శుభం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube