మాఘ మాసం.. ఆ సమయంలో స్నానం చేస్తే ఏన్నో జన్మల పుణ్యం..

మాఘ మాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల.చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం.

 Importance Of Bathin In Magamasam..,magamasam , Devotional , River , Bath, Chand-TeluguStop.com

యజ్ఞ యాగాది క్రతువులకు మాఘ మాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు.ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉదయ కాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది.

పాప రాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘ మాస సంప్రదాయం.మాఘ స్నానాలు సకల కలుషాలను హరిస్తాయని పెద్దల విశ్వాసం.

ప్రత్యూష కాలంలో సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి.ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి.

జనవరి 20నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.

మాఘ మాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు.బావి నీటి స్నానం పన్నెండేళ్ల పుణ్య ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శత గుణం, గంగా స్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శత గుణ ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే చాలా మంది మాఘ మాసం పుణ్య స్నానాలకు వెళ్తుంటారు.అది చాలా మంచిదని కూడా చెబుతుంటారు.

Importance Of Bathin In Magamasam,magamasam , Devotional , River , Bath, Chandra Bhagavan - Telugu Devotional, Magha Masam

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube