వర్షాల ప్రభావం చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవు..!!

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా దక్షిణ కోస్తా అదేరీతిలో రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 Impact Of Rains Holiday For Educational Institutions In Chittoor Tirupati, Chitt-TeluguStop.com

ఈ క్రమంలో అల్పపీడన ప్రభావం ఎక్కువగా నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఉండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ జిల్లాలో ఉండే జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో ఇప్పటికే తిరుపతిలో భయంకరంగా వరదనీరు రోడ్లపైకి.

ఇళ్లలోకి చేరడంతో.తిరుపతి వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.

అదే విధంగా నెల్లూరులో కూడా.లోతట్టు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Telugu Ap, Chittoor, Chittur Dist, Heavy Ap, Impactholiday, Tirupati-Latest News

ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో మళ్లీ వర్షాలు భారీగా కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగింది.అంతేకాకుండా ఈరోజు ఉదయం 5 గంటల నుండి మళ్ళీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు  జారీ చేయడం జరిగింది.దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి.ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకొంటున్నారు.చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో.

ఘాట్ రోడ్డులు.క్రమక్రమంగా మూసేస్తున్నారు.

వరద నీరు రోడ్లపైకి వస్తూ ఉండటంతో.తిరుపతికి మిగతా చుట్టుప్రక్కల గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.

చిత్తూరు జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube