కరోనా నుండి కోలుకున్నా.. మళ్ళీ మూడునెలల్లోనే..?

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న విషయం తెలిసిందే.ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది.

 Immunity Loss Within Three Months After Recovered From Corona,coronavirus,  Im-TeluguStop.com

అయితే భారీగా కేసులు పెరిగిపోతున్నప్పటికీ ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో రికవరీ రేటు ఎక్కువగా ఉండడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది.

కరోనా వైరస్ బారిన పడినప్పటికీ 14 రోజుల పాటు చికిత్స తీసుకొని వైరస్ బారి నుంచి కోరుకుంటున్నారు చాలామంది.

కొంతమందికి కాస్త ఆలస్యం అయిన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోతున్నారు.అయితే కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండక పోతే మాత్రం మళ్లీ ప్రాణాల మీదికి వచ్చే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నప్పుడు ఉన్న రోగనిరోధకశక్తి మూడు నెలల సమయంలోనే తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడయింది.

లండన్ కు చెందిన కింగ్స్ కాలేజీ పరిశోధకులు కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారిపై పరిశోధనలు చేశారు.

కరోనా వైరస్ నుండి కోలుకున్నప్పటికీ మూడు నెలల వ్యవధిలోనే… కరోనా వైరస్ ని ఎదిరించే యాంటీబాడీలు తగ్గిపోతాయని.రోగ నిరోధక శక్తి కోల్పోతారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

అయితే ఒక వైరస్ వచ్చినపుడు దానినుండి కోలుకున్నాక మళ్లీ అదే వైరస్ సోకితే అది మనపై పెద్దగా ప్రభావం.కానీ కరోనా విషయంలో మాత్రం అలా జరగదు అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube