సినీ హీరో శివాజీ మరోసారి దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో దొరికిపోయారు.అలంద మీడియా కేసులో వాటాల కొనుగోలు వ్యవహారంలో పోలీసు విచారణకు హాజరు కాకపోవడం తో లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్ళడానికి వీలులేదు.అయితే ఆమధ్య పోలీసుల కళ్లు గప్పి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నించి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దొరికిపోయిన సంగతి తెలిసిందే.
ఐతే ఇప్పుడు తాజాగా దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకొని హైదరాబాద్ కు వెళ్లాల్సిందిగా సూచించారు.అయితే లుకౌట్ నోటీసులు ఉన్న శివాజీ ఈ విధంగా విదేశాలకు పారిపోతూ రెండు సార్లు అధికారులకు దొరికిపోయాడు.
అయితే ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయంలో శివాజీ ని అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం.దీనికి సంబందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
టీవీ 9 షేర్లు కొనుగోలు వ్యవహారంలో హీరో శివాజీ మరియు టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ పై అలంద మీడియా సంస్థ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసు కు సంబంధించి ఇద్దరూ విచారణకు హాజరు కాకపోవడం తో పోలీసులు ఇద్దరికీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు.అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసిన తరువాత రవి ప్రకాష్ పోలీసుల విచారణకు హాజరయ్యారు కానీ,శివాజీ మాత్రం తప్పుకొని తిరుగుతూనే ఉన్నారు.ఈ క్రమంలో ఈ విధంగా విదేశాలకు పారిపోతూ రెండు సార్లు పట్టుబడ్డారు.
రెండు సార్లు కూడా ఆయన అమెరికా కు పారిపోయేందుకే ప్రయత్నించారు.