కాంగ్రెస్ లోకి వలసలు సరే ! ఆ తరువాత ఏంటి..?  

  • తెలంగాణలో ఓటింగ్ సమయం దగ్గరకు వచ్చేకొద్దీ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి.టిఆర్ఎస్ లో నెలకొన్న టికెట్ వివాదాలు ముదిరి పాకానపడ్డాయి ఇక్కడ వ్యవహారాలతో విసుగు చెందిన నాయకులంతా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ పరిణామం గులాబీ శిబిరంలో గుబులు పుట్టిస్తుండగా కాంగ్రెస్ లో జోష్ పెంచుతోంది. ఇప్పటికే టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.

  • Immigration In To Congress From TRS-

    Immigration In To Congress From TRS

  • ఆయనతోపాటు టిఆర్ఎస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ రాములు నాయక్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నాయి . అయితే డి ఎస్ రాకెట్ రాకను కాంగ్రెస్ లోని మెజార్టీ సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆయనకు కాంగ్రెస్ అధిష్టానంతో ఆయనకున్న పరిచయాలు, పలుకుబడి కారణంగా డి ఎస్ చేరికకు మార్గం సులువైనట్టు తెలుస్తోంది. అయితే డి ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలనే షరతు కూడా కాంగ్రస్ విధించినట్టు తెలుస్తోంది.

  • Immigration In To Congress From TRS-
  • ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్న వారంతా టిక్కెట్ కోసం వచ్చిన వాళ్లే. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్ దగ్గర్నుంచి నల్లగొండ జిల్లా దేవరొండకు చెందిన బాలూనాయక్ వరకూ అందరూ టిక్కెట్ల కోసమే పార్టీలో చేరారు. వీరందరికి టిక్కెట్లు సర్దుబాటు చేయగలరా? ఒక వేళ సర్దుబాటు చేస్తే. మిగిలిన పార్టీ నేతలు ఊరుకుంటారాఅనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి చేయనందున ప్రస్తుతానికి ఆ పార్టీలో ఈ అసంతృప్తులు కనిపించడంలేదు. అయితే టికెట్ల ప్రకటన అనంతరం టీఆర్ఎస్ లో నెలకొన్న పరిణామాలే ఇక్కడా జరిగే అవకాశం లేకపోలేదు.