తొక్కలో పకోడీగాడు అంటూ ఇమ్మాన్యుయేల్ ను అవమానించిన వర్ష.. ఏమైందంటే?

జబర్దస్త్ జోడీలలో సుధీర్ రష్మీ జోడీ తర్వాత అదే స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న జోడీగా ఇమ్మాన్యుయేల్ వర్ష జోడీకి పేరుంది.ఈ జోడీ చేసిన స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు జబర్దస్త్ షోకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మంచి పేరు రావడానికి కారణమవుతున్నాయి.

 Immanuel Varsha Punches In Jabardast Show Goes Viral In Social Media Details, Em-TeluguStop.com

ఇమ్మాన్యుయేల్ వర్ష ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తుండగా ఈ ఈవెంట్లు సైతం సక్సెస్ అవుతుండటం గమనార్హం.

అయితే కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేయడంతో వర్ష జబర్దస్త్ షోలో బాధ పడ్డారు.

జబర్దస్త్ షోకు గుడ్ బై చెబుతానంటూ గతంలో వర్ష షాకింగ్ కామెంట్లు చేశారు.అయితే తాజాగా ప్రసారమైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో ఇమ్మాన్యుయేల్, వర్ష ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకున్నారు.

ఇమ్మాన్యుయేల్ తన భార్య పాత్ర పోషిస్తున్న అమ్మాయితో కొంచెం పెదాలు తడపచ్చు కదా అని అడుగుతాడు.ఇమ్మాన్యుయేల్ అలా అడగడంతో అవతలి అమ్మాయి ఇమ్మాన్యుయేల్ ముఖంపై నీళ్లు చల్లుతుంది.

పెదాలు తడపడమంటే ఇది కాదని వర్షను అడిగి నేర్చుకోవాలని ఇమ్మాన్యుయేల్ చెబుతాడు.

వర్ష తడపడం కాదని సునామీనే సృష్టిస్తుందని ఆపేవరకు ఆగదని ఇమ్మాన్యుయేల్ కామెంట్లు చేస్తారు.ఆ తర్వాత నూకరాజు ఎంట్రీ ఇచ్చి వర్షతో హగ్ తీసుకోవడం తన ఆఖరి కోరిక అని చెబుతాడు.వర్ష వెంటనే తొక్కలో పకోడీగాడు హగ్ తీసుకున్నప్పుడు నీకు ఇవ్వడంలో ఏముందని చెబుతూ వర్ష నూకరాజుకు హగ్ ఇస్తారు.

వర్ష తనను తొక్కలో పకోడీగాడు అనడంతో కంగు తినడం ఇమ్మాన్యుయేల్ వంతైంది.ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ అనుభవించు రాజా హీరోయిన్ ను చూపిస్తూ ఈ హీరోయిన్ లా ఉంటే చూడాలనిపిస్తుందని వర్షలా ఉంటే చూడలేమని చెబుతాడు.ప్రోమోలో రష్మీ గ్లామరస్ గా కనిపించడం గమనార్హం.ఈ నెల 26వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube