సుడిగాలి సుధీర్ వల్ల ఆగిపోయిన పెళ్లి.. ఏం జరిగిందంటే..?

గత కొన్ని నెలల నుంచి ఈటీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈ షో ప్రసారమవుతుంది.

 Immanuel Varsha Marriage Stopped Because Of Sudigali Sudheer-TeluguStop.com

నిన్న ప్రసారమైన ఎపిసోడ్ లో బుల్లితెర జోడీ వర్ష, ఇమ్మాన్యుయేల్ పెళ్లి జరిగినట్లు ప్రోమోల్లో చూపించారు.అయితే సుడిగాలి సుధీర్ ఇచ్చిన సలహా వల్ల ఇమ్మాన్యుయేల్ వర్ష పెళ్లి ఆగిపోతుంది.

పెళ్లికి కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలనే నిబంధన ఉంటుంది.అయితే సుడిగాలి సుధీర్ మాత్రం 40 మందిని పిలవమని సలహా ఇస్తాడు.ఇమ్మాన్యుయేల్ పెళ్లికి ఎక్కువమందిని పిలవడంతో పోలీస్ గెటప్ లో ఉన్న గెటప్ శ్రీను ఇమ్మాన్యుయేల్ ను అరెస్ట్ చేస్తాడు.అయితే ఇమ్మాన్యుయేల్ ఊహలో మాత్రం వర్షకు, ఇమ్మాన్యుయేల్ కు పెళ్లి జరిగినట్లు చూపించారు.

 Immanuel Varsha Marriage Stopped Because Of Sudigali Sudheer-సుడిగాలి సుధీర్ వల్ల ఆగిపోయిన పెళ్లి.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇమ్మాన్యుయేల్ తన పక్కన నుంచున్న మొదటి అమ్మాయి వర్ష అని వర్షనే చివరి అమ్మాయి కావాలని కోరుకుంటున్నానని చెప్పారు.

సుధీర్ వల్ల పెళ్లి ఆగిపోవడంతో ఇమ్మాన్యుయేల్ తాను 20 మందితో పెళ్లి చేసుకుంటానన్నా సుధీర్ వినలేదని గెటప్ శ్రీనుకు చెబుతూ అరేయ్ సుధీర్ ఇటు రా అని ఇమ్మాన్యుయేల్ పిలుస్తాడు.ఆ తరువాత జై కట్టప్ప అంటూ ఇమ్మాన్యుయేల్ సుధీర్ ను కత్తితో పొడుస్తాడు.ఆ తర్వాత గెటప్ శ్రీను హత్యాయత్నం చేసినందుకు ఇమ్మాన్యుయేల్ ను 14 సంవత్సరాలు జైలులో ఉంచాలని చెబుతాడు.

ఈ మూహూర్తం మిస్సైతే 2 సంవత్సరాల వరకు ముహూర్తం లేదని ఇమ్మాన్యుయేల్ చెప్పగా 14 సంవత్సరాల వరకు నీకు జైలులోనే పెళ్లి చేస్తామని గెటప్ శ్రీను చెబుతాడు.సీనియర్ హీరోయిన్ ఇంద్రజ నిన్న ప్రసారమైన ఎపిసోడ్ కు గెస్ట్ గా రావడం గమనార్హం.వర్ష ఇమ్మాన్యుయేల్ పెళ్లి పేరుతో ఛానల్ నిర్వాహకులు నిన్నటి ఎపిసోడ్ కు ప్రమోషన్స్ చేయగా ఈ షో ఎంత టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

#ImmanuelVarsha #SrideviDrama #Immanuel #Varsha #SrideviDrama

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు