వర్ష జాకెట్‌పై ఇమాన్యూయేల్ అలాంటి కామెంట్లు.. పరువు పోయేలా..?

తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో వర్ష పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.సీరియళ్లలో నటించినా రాని గుర్తింపు వర్షకు జబర్దస్త్ షో ద్వారానే రావడం గమనార్హం.

 Immanuel Comments About Varsha Dressing In Jabardasth Show , Comments About Blou-TeluguStop.com

మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన వర్ష ప్రస్తుతం బుల్లితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉంటున్నారు.రోజురోజుకు ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది.

ఇమ్మాన్యుయేల్ తో వర్ష ప్రేమలో ఉన్నట్టు చేసిన స్కిట్లు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

తన గ్లామర్ ద్వారా ఆకట్టుకుంటున్న వర్ష హైపర్ ఆది స్కిట్లలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి జబర్దస్త్ షోలో ఇమ్మాన్యుయేల్ తో పాటు మరి కొందరి టీమ్ లలో స్కిట్లు చేస్తున్నారు.

ఈటీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా వర్ష సందడి చేస్తుండటం గమనార్హం.వీళ్లిద్దరికి పెళ్లి జరిగినట్టు మల్లెమాల నిర్వాహకులు ఒక ఈవెంట్ కు కూడా కొన్ని వారాల క్రితం ప్రసారం చేయడం గమనార్హం.

తాజాగా విడుదలైన ప్రోమోలో ఇమ్మాన్యుయేల్ అనుమానపు మొగుడు పాత్రను వేశారు.ఇమ్మాన్యుయేల్ వర్షతో ఏంటే ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయలేదు అని అడగగా అంటే వాడు రాలేదు వాడు వస్తే చూడమని ముగ్గేస్తావంటూ కామెంట్లు చేశారు.ఎవడాడు అని ఇమ్మాన్యుయేల్ అడగగా వర్ష తాను పద్ధతికి చీర కట్టినదానిలా ఉంటానని చెబుతుంది.వెంటనే సూపర్ అంటూ ఆమె బ్లౌజ్ ను చూపిస్తాడు.

ఎవరైనా బ్లౌజ్ లకు చిన్న చిన్న కిటికీలను పెట్టుకుంటారని నువ్వు మాత్రం 70 ఎం.ఎం తెర పెట్టావేంటని ఇమ్మాన్యుయేల్ కామెంట్లు చేస్తాడు.శుక్రవారం రోజు రాత్రి ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా ప్రోమోకు ఇమ్మాన్యుయేల్ వర్ష కలిసి చేసిన స్కిట్ హైలెట్ గా కనిపిస్తుండటం గమనార్హం.మరి ఇమ్మాన్యుయేల్ వర్ష రియల్ జోడీనో రీల్ జోడీనో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube