వాషింగ్టన్ : బ్యాక్ టూ హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ .. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ పదవిని వీడనున్న గీతా గోపీనాథ్

అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐఎంఎఫ్‌)లో చీఫ్ ఎకన‌మిస్ట్‌గా ఉన్న భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్ ఆ పదవిని వీడబోతున్నారు.

మూడేళ్ల పాటు ఐఎంఎఫ్‌కు అసమాన సేవ‌లు అందించిన గీత మ‌ళ్లీ తిరిగి హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ఆర్థిక‌శాస్త్రం విభాగంలో చేర‌నున్నారు.

ఏడాది పాటు హార్వ‌ర్డ్ వ‌ర్సిటీకి సెలవు పెట్టి వ‌చ్చిన గీతా గోపినాథ్‌.ఐఎంఎఫ్‌లో మూడేళ్లు పాటు విధులు నిర్వర్తించారు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలో ప‌రిశోధ‌నా విభాగానికి అధిప‌తిగా ఉన్న ఆమె ఆధ్వర్యంలోనే వ‌ర‌ల్డ్ ఎక‌నమిక్ ఔట్‌లుక్ నివేదిక‌లు త‌యార‌య్యేవి.గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్‌ను వీడటంపై ఆ సంస్థ ఎండీ క్రిస్టలినా జార్జీవా స్పందించారు.

ఐఎంఎఫ్‌ చీఫ్ ఎకనమిస్ట్ పదవిలో ప‌నిచేసిన తొలి మ‌హిళ గీతా గోపినాథ్ అని ప్ర‌శంసించారు.కరోనా మ‌హ‌మ్మారి సమయంలో గీత అద్భుతంగా పనిచేశారని క్రిస్ట‌లినా కొనియాడారు.

Advertisement

అప్పటి వరకు ఐఎంఎఫ్‌ పరిశోధన విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన మౌరీ ఆస్టెఫెల్డ్‌ 2018 డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేశారు.దీంతో 2018 అక్టోబ‌ర్‌లో ఐఎంఎఫ్ చీఫ్ ఎకన‌మిస్ట్‌గా నియ‌మితులైన గీతా గోపీనాథ్.2019 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు.భారత్‌లో పుట్టి పెరిగిన గీతా గోపీనాథ్‌కు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.

కోల్‌కతాలో పుట్టిన ఈమె కర్ణాటకలోని మైసూరులో పెరిగారు.ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ .ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నుంచి ఎంఏ డిగ్రీలు పూర్తి చేశారు.అనంతరం 2001లో ప్రిన్స్‌స్టన్‌ యూనివర్సిటీలో ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్‌ చికాగాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు.2005లో ప్రతిష్టాత్మక హార్వర్డ్‌కు వెళ్లారు.

గీతా గోపీనాథ్ 2016లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు.అయితే ఈ నియామకం వివాదాస్పదమైంది.కాగా గీతా గోపీనాథ్.

ఎక్స్చేంజ్‌ రేట్లు, వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ద్రవ్య పరపతి విధానం, రుణాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ సంక్షోభాలు వంటి వివిధ ఆర్థికాంశాలపై 40 వరకూ పరిశోధన పత్రాలను సమర్పించారు.ఆర్ధిక శాస్త్రానికి అసమాన సేవలు చేసిన గీతా గోపీనాథ్ ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు.2014లో ఐఎంఎఫ్ గుర్తించిన 45 అగ్రశ్రేణీ ఆర్థికవేత్తల్లో గీతా 25వ ర్యాంక్ పొందారు.వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2011లో గీతను యంగ్ గ్లోబల్ లీడర్‌గా గుర్తించింది.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు