మహేష్ బాబుకే లేదు... నీకు అవసరమా సునీల్..?   

Senior Director Imandhi Ramarao Doing Sensational Comments On Sunil Six Pack Body-sunil,sunil And Mahesh Babu,sunil Health News,sunil Latest News,sunil Six-pack Body,tollywood News

తాజాగా టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు హీరో సునీల్ ఆరోగ్యంపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ప్రస్తుతం సునీల్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అందువలన హైదరాబాదులో ఉన్నటువంటి ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

Senior Director Imandhi Ramarao Doing Sensational Comments On Sunil Six Pack Body-Sunil Sunil And Mahesh Babu Health News Latest Six-pack Body Tollywood

అయితే ఈ విషయంపై తాజాగా సీనియర్ సినీ విశ్లేషకుడు ఇమంది రామారావు స్పందించారు.ఇందులో భాగంగా సునీల్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈమంది రామారావు.

అసలు సునీల్ కి సిక్స్ ప్యాక్ బాడీ అవసరం లేదని అనవసరంగా సిక్స్ ప్యాక్ బాడీ కోసం కష్టపడి తన ఆరోగ్యం పాడు చేసుకున్నాడని అన్నారు.అంతేగాక తనకు ఒక్కోసారి అసలు సునీల్ హ్యాపీగా కామెడీ చేసుకోకుండా ఎందుకు హీరో అయ్యాడో అని అర్థం కావడం లేదని అన్నాడు.

అంతేగాక ఈ సిక్స్ ప్యాక్ విషయంపై గతంలో మహేష్ బాబు కూడా మాట్లాడుతూ తనకు సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నిస్తుంటే తన ముఖ కవళికలు లో తేడాలు వస్తున్నట్లు అందువలన సిక్స్ ప్యాక్ బాడీ కోసం చేసే ప్రయత్నాలు ఆపేశానని కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.అయితే మహేష్ బాబుకి అవసరం లేని  సిక్స్ ప్యాక్ బాడీ సునీల్ కి అవసరమా అంటూ ఎద్దేవా చేశారు.

అయితే ఇది ఇలా ఉండగా తన ఆరోగ్యం విషయంపై ఇప్పటికే సునీల్ స్పందిస్తూ తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తన అభిమానులకు సూచించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

Senior Director Imandhi Ramarao Doing Sensational Comments On Sunil Six Pack Body-sunil,sunil And Mahesh Babu,sunil Health News,sunil Latest News,sunil Six-pack Body,tollywood News Related....