కరోనా మాట వినగానే చిన్న పిల్లలు సైతం భయ పడుతున్నారు.అంతగా ప్రజల జీవన విధానంపై కరోనా ప్రభావం చూపింది.
చాలా మంది ప్రజలు ఎంతో దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.తినడానికి తిండి లేక ఉపాధి కూడా కోల్పోయి రోడ్డున పడ్డారు.
ప్రజల జీవనం మొత్తం అతలాకుతలం చేసేసింది.ఈ సమయంలో వచ్చిన ఆర్ధిక సమస్యలను తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.
ఇలాంటి ఘటనకు చలించి పోయిన నలుగురు స్నేహితులు పేదలను ఆదుకోవాలని ముందుకు వచ్చారు.వారికీ చేతనైనంత సహాయం చేయడానికి శ్రీకారం చుట్టారు.
ఒక కొత్త ఆలోచనతో కరోనా సమయంలో సమస్యలను ఎదుర్కొన్న వారికీ అండగా నిలబడాలని భావించారు.అనుకున్నదే తడవుగా కొత్తగా అలోచించి ఒక షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసారు.
అది మాములు షాపింగ్ మాల్ కాదు.అందులో ఏ దుస్తులు అయినా కేవలం ఒక్క రూపాయి మాత్రమే.అవును మీరు విన్నది నిజమే.ఈ షాపింగ్ మాల్ లో ఏ దుస్తులు కొన్న కేవలం ఒక్క రూపాయి మాత్రమే.పూర్తి వివరాల్లోకి వెళ్తే.బెంగుళూరుకు చెందిన నలుగురు స్నేహితులు కలిసి ఇమాజిన్ క్లాత్ బ్యాంక్ పేరుతొ నిరుపేదల కోసం షాపింగ్ మాల్ ను స్టార్ట్ చేసారు.
వారు ఉంటున్న ఇళ్ల దగ్గర ప్రజల నుండి బట్టలను విరాళంగా తీసుకుని వాటిని శుభ్రం చేసి షాపింగ్ మాల్ లో విక్రయిస్తున్నారు.కేవలం ఆదివారం మాత్రమే తెరుచుకునే ఈ షాపింగ్ మాల్ లో అన్ని వయసుల వారికీ.
అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయి.ఏ దుస్తులు తీసుకున్న కేవలం ఒక్క రూపాయి మాత్రమే.
ఇప్పటి వరకు ఇక్కడ 150 పేద కుటుంబాలు దుస్తులు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు.వీరిని నెటిజెన్స్ ప్రశంసిస్తున్నారు.
మరింత మంది ముందుకు వచ్చి దుస్తులను ఇవ్వాలని వారు కోరుతున్నారు.