లైట్ తీసుకుంటే అంతే.. భారీ మూల్యం చెల్లించక తప్పదు!

Ima Warns Of Massive Third Wave Urges People To Follow Covid 19 Protocol

ప్రపంచ దేశాలను కరోనా ఎంతగా బయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కరోనా ఫస్ట్ వేవ్ తోనే అతలాకుతలం అయినా ప్రజలకు సెకండ్ వేవ్ కోలుకోలేకుండా చేసింది.

 Ima Warns Of Massive Third Wave Urges People To Follow Covid 19 Protocol-TeluguStop.com

ప్రజల జీవన విధానం అంత అస్తవ్యస్తం అయ్యింది.ఎంతో మంది కరోనా బారిన పడి మరణించగా.

ఇంకొంత మంది జీవనాధారం కోల్పోయి రోడ్డు మీదకు వచ్చేసారు.ఇక ఇప్పుడిప్పుడే కరోనా నుండి బయట పడి కోలుకుంటున్న ప్రజలకు మరోక వైరస్ షాక్ ఇస్తుంది.

 Ima Warns Of Massive Third Wave Urges People To Follow Covid 19 Protocol-లైట్ తీసుకుంటే అంతే.. భారీ మూల్యం చెల్లించక తప్పదు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా పూర్తిగా పోలేదని మాస్కులు వాడుతూ.సోషల్ డిస్టెన్స్ పాటించాలని.

శానిటైజర్ వెంట బెట్టుకుని తిరగాలని ప్రభుత్వం ప్రజలకు సూచిస్తూనే వస్తుంది.కానీ అవేమి పట్టించు కోకుండా కనీసం మాస్కులు కూడా లేకుండా బయట తిరిగే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

దీంతో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉన్నారు.

ఇక ఇప్పుడు ప్రపంచ దేశాలు మరొక కొత్త వేరియంట్ అయినా ఒమిక్రాన్ కు గడగడలాడుతున్నారు.

సౌత్ ఆఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగు        చూసిన విషయం తెలిసిందే.చాపకింద నీరులా మెత్తగా విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది.

అయితే ఇది అంత ప్రమాదం కాదని.ప్రాణాలకు ముప్పులేదని పలువురు అభిప్రాయం పడుతున్నారు.

కానీ ఒమిక్రాన్ ను లైట్ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించాలని చెబుతున్నారు వైద్యులు.

Telugu Covid, Covid Wave, Iit Scientist, Ima Warns, Imawarns, India, India Wave, Indian Medical, Masks, Omicron, Diatance-Latest News - Telugu

ఇప్పటికే రెండు సార్లు కరోనా చేసిన విలయతాండవాన్నీ ప్రత్యక్షంగా చూశాము.ఇక ఇప్పుడు ఒమిక్రాన్ ను సీరియస్ గా తీసుకోకుంటే.ఉపద్రవం తప్పదని ఇండియన్ పరిశోధకులు, వైద్యులు చెబుతున్నారు.

ఇక ఇప్పుడు రానున్న పండుగల రోజుల్లో జనాలు గుంపులు గుంపులుగా సెలెబ్రేట్ చేసుకుంటాం.ఆ తరుణంలో కొద్దిగా జాగ్రత్తగా లేకపోయినా ఒమిక్రాన్ వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Telugu Covid, Covid Wave, Iit Scientist, Ima Warns, Imawarns, India, India Wave, Indian Medical, Masks, Omicron, Diatance-Latest News - Telugu

అందుకే దీనిని సీరియస్ గా తీసుకుంటే తరిమేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారత్ లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుంది.ఇక రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం లేకపోలేదు అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది.వ్యాక్సిన్ మాత్రమే దీనిని అడ్డుకుంటుందని .అందుకే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తుంది.

#Omicron #COvid #IIT Scientist #Masks #India Wave

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube