నేనేం దయ్యం కాదు : ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఎక్కువ ఆయన డ్యాన్స్‌ అంటే పడి చస్తారు.ఎన్టీఆర్‌ ప్రతి సినిమాలో కూడా కొత్త కొత్త స్టెప్పులను కోరుకుంటారు.

 I’m Not Ghost Said Jr.ntr-TeluguStop.com

‘యమదొంగ’ చిత్రంలో నాచోరే సాంగ్‌కు ఎన్టీఆర్‌ వేసిన స్టెప్పులు ఎప్పటికి మర్చి పోలేం.అటువంటి స్టెప్పులు ఎన్టీఆర్‌ పలు సినిమాల్లో వేశాడు.

అయితే ఇప్పుడు అలాంటి డాన్స్‌లు, స్టెప్పులు నా వల్ల కాదని ఎన్టీఆర్‌ మొహ మాటం లేకుండా చెప్పేస్తున్నాడు.తాజాగా ఎన్టీఆర్‌ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ డాన్స్‌ల గురించి మాట్లాడాడు.

గతంలో మాదిరిగా ఇప్పుడు నేను డాన్స్‌లు వేయలేను అని, ఇప్పుడు నేను ఒక కొడుకుకు తండ్రిని అని, నా వయస్సు అందుకు సహకరించదు అని ఎన్టీఆర్‌ నిర్మొహమాటంగా చెప్పాడు.అలా చేసేందుకు నేనేం దయ్యాన్ని కాదు అంటూ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు.

ఈ చిత్రంలో తన స్థాయికి తగ్గట్లుగా ఒక పాటలో డాన్స్‌ చేశాను అని, అన్ని పాటల్లో కూడా కొత్త స్టెప్పులు, కష్టమైన స్టెప్పులు వేయడం అంటే మామూలు విషయం కాదు అని, అలా ఎవరికి సాధ్యం అవ్వదు అని, నాకు అసలే సాధ్యం అవ్వదు అంటూ ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు.రేపు ఎన్టీఆర్‌ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

కొత్త లుక్‌లో ఎన్టీఆర్‌ ఆ చిత్రంలో కనిపించనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube