పాపం.. ఆ స్టార్ హీరో కూతురు డిప్రెషన్ కి గురైందట!

ఈ మధ్య కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు.కొంతమంది సరైన సమయంలో మానసిక వైద్యులను సంప్రదించి ఈ సమస్యల నుంచి బయటపడినా చాలామందికి ఈ సమస్యలకు చికిత్స గురించి సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు.

 Im Clinically Depressed Confesses Aamir Khans Daughter Ira Khan, Aamir Khan's Da-TeluguStop.com

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కూతురు డిప్రెషన్ తో బాధ పడుతున్నట్టు వెల్లడించింది. బాలీవుడ్ సూపర్​స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఐరా ఖాన్ తన్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాలోవర్లతో మాట్లాడుతూ తన మానసిక ఆరోగ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.గత నాలుగు సంవత్సరాల నుంచి తాను డిప్రెషన్ తో బాధ పడుతున్నానని “వరల్డ్ మెంటల్ హెల్త్ డే” సందర్భంగా తన ఫాలోవర్లకు వెల్లడించింది.

అమీర్ ఖాన్ గారాలపట్టి ఐరా ఈ విషయం వెల్లడించగానే ఆమె ఫాలోవర్లు అవాక్కయ్యారు.అయితే ఫాలోవర్లు ఆరోగ్యం గురించి కంగారు పడవద్దని ఆమె చెప్పారు.

గతంతో పోలిస్తే సమస్య తగ్గుముఖం పట్టిందని.వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ డిప్రెషన్ నుంచి కోలుకున్నానని ఐరా వెల్లడించింది.

మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒకటి చేయాలని తనకు అనిపిస్తోందని ఐరా పేర్కొంది.అయితే ఏం చేస్తే మానసిక ప్రశాంతతను పొందగలుగుతానో తనకు అర్థం కావడం లేదని ఐరా తెలిపింది.

ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో విషయాలు చోటు చేసుకుంటున్నాయని తమ మనస్సులోని మాటలను వ్యక్తపరచాలని ఎంతోమంది అనుకుంటున్నారని ఐరా అన్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఐరా ఖాన్ ఫాలోవర్లను పెంచుకుంటూ ఫాలోవర్లకు తన లైఫ్ కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఉంటారు.

లాక్ డౌన్ సమయంలో అల్లరి పనులు చేసి ఐరా ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.టాటూలు వేసి ఆ టాటూలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఐరా డిప్రెషన్ తో బాధ పడుతుందని తెలిసి అమీర్ ఖాన్ అభిమానులు ఆమె త్వరగా సమస్య నుంచి పూర్తిగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube